AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కవట.. కారణం తెలిస్తే షాకే..

మీ బ్లడ్ గ్రూప్‌.. మీకు వచ్చే వ్యాధులను కూడా చెబుతుందని కొత్త అధ్యయనంలో తేలింది. రక్త వర్గం A ఉన్నవారికి 60 ఏళ్ల లోపు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఇతరుల కంటే ఎక్కువగా ఉంటుంది అట. 17 వేల మంది స్ట్రోక్ రోగుల డేటా విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించింది. A బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లకు మాత్రమే స్ట్రోక్ ఎందుకు ముందుగా రక్తం గడ్డకట్టే కారకాలు దీనికి కారణం కావచ్చు.

ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కవట.. కారణం తెలిస్తే షాకే..
Blood Type A Stroke Risk
Krishna S
|

Updated on: Dec 14, 2025 | 7:22 AM

Share

మనందరికీ తెలిసినట్లుగా రక్తంలో A, B, AB, O వంటి విభిన్న గ్రూపులు ఉన్నాయి. ఎర్ర రక్త కణాల ఉపరితలంపై ఉండే రసాయన గుర్తుల ఆధారంగా ఈ వర్గీకరణ జరుగుతుంది. రక్తం ఎక్కించడానికి, అవయవమార్పిడి వంటి పరిస్థితులలో ఈ గ్రూపులు ఉపయోగపడతాయి. అయితే ఈ గ్రూపులు కేవలం రక్తం ఎక్కించడానికి మాత్రమే కాదు.. కొన్ని రకాల వ్యాధుల ప్రమాదాన్ని కూడా సూచించగలదని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. తాజా అధ్యయనం ప్రకారం.. రక్త వర్గం A ఉన్న వ్యక్తులకు ఇతరుల కంటే తక్కువ వయసులోనే స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది.

2022లో ప్రచురించబడిన ఒక జన్యు అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. సుమారు 17 వేల మంది స్ట్రోక్ రోగులు, 600,000 మంది ఆరోగ్యవంతుల డేటాను విశ్లేషించిన తర్వాత ఈ ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా 60 ఏళ్ల లోపు స్ట్రోక్ వచ్చిన వారిపై ఈ అధ్యయనం జరిగింది. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలోని వైద్య నిపుణులు నిర్వహించిన ఈ అధ్యయనంలో మన ప్రత్యేకమైన రక్త వర్గం మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకున్నారు.

A రక్త వర్గం ఎంత ప్రమాదకరం?

ఇతర రక్త వర్గాల వారితో పోలిస్తే రక్తం వర్గం A ఉన్నవారికి 60 ఏళ్ల లోపు స్ట్రోక్ వచ్చే అవకాశం 16 శాతం ఎక్కువగా ఉందని పరిశోధనలో గుర్తించారు. ఈ అధ్యయనంలో రక్తం వర్గం O ఉన్నవారికి స్ట్రోక్ ప్రమాదం అతి తక్కువగా ఉందని తేలింది. రక్తం వర్గం B ఉన్నవారికి కూడా స్ట్రోక్ ప్రమాదం.. O వర్గం వారితో పోలిస్తే, 11 శాతం ఎక్కువగా ఉంది.

స్ట్రోక్ – రక్త వర్గం మధ్య సంబంధం ఏమిటి?

రక్తం వర్గం A ఉన్నవారికి స్ట్రోక్ ప్రమాదం ఎందుకు పెరుగుతుందో ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదు. అయితే దీనికి రక్తం గడ్డకట్టే కారకాలు కారణం కావచ్చు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్లేట్‌లెట్స్, ఇతర గడ్డకట్టే ప్రోటీన్లు రక్తం వర్గం A ఉన్నవారిలో కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. దీనివల్ల రక్తం గడ్డకట్టే అవకాశం పెరుగుతుంది. చిన్న వయసులో వచ్చే స్ట్రోక్‌లకు సాధారణంగా రక్తం గడ్డకట్టే సమస్యలే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఈ పరిశోధన కేవలం ఒక ప్రమాద కారకం గురించి మాత్రమే తెలియజేస్తుంది తప్ప.. A రక్త వర్గం ఉన్న అందరికీ స్ట్రోక్ వస్తుందని కాదు. అయితే A, B రక్త వర్గాలు ఉన్నవారు ధూమపానం, అధిక రక్తపోటు వంటి ఇతర ప్రమాద కారకాలను నియంత్రించుకోవడానికి మరింత శ్రద్ధ వహించాలి. మీ రక్త వర్గం ఏదైనా సరే, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, ధూమపానం, మద్యం మానేయడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.

మరిన్ని  హెల్త్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు జాగ్రత్త.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం..
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
ఈ చిత్రంలో రెండు అంకెలు ఉన్నాయ్.. 5 సెకన్లలో కనుగొన్నారో జీనియసే
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న దేఖ్ లేంగే సాలా సాంగ్..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
ఈ కష్టం ఏ తండ్రికీ రాకూడదు.. టెట్ పరీక్షకు తీసుకెళ్తుండగా..
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
భారీ డీల్.. తెలంగాణలో అమెజాన్‌ డేటా సెంటర్‌.. ఎక్కడో తెలుసా?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ప్రతి నెలా రూ.10 వేలు SIPలో పెడితే.. చేతికి ఎంతొస్తుంది?
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల 2026 మార్కుల కేటాయింపులో కీలక మార్పులు
11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తోపు హీరోయిన్..
11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తోపు హీరోయిన్..
బంగారం, వెండి కొనాలనుకుంటే ఇదే రైట్‌ టైమ్‌!
బంగారం, వెండి కొనాలనుకుంటే ఇదే రైట్‌ టైమ్‌!
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..