AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యంగ్‌ ఏజ్‌లోనే పెద్ద వాళ్లలా కనిపిస్తున్నారా?.. ఈ అలవాట్లే ప్రధాన కారణం! తస్మాత్ జాగ్రత్త!

ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న వయసులోనే చాలా పెద్దవారిగా కనిపిస్తున్నారు. వాళ్లకు 25 నుండి 30 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ 40 నుండి 50 సంవత్సరాల వయస్సు గలవారిగా కనిపిస్తారు. ఇందుకు ప్రధాన కారణంగా మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు. ఈ అలవాట్ల కారణంగా జనాలు చిన్న యస్సులోనే పెద్దవారికిగా కనిపిస్తున్నారు. కాబట్టి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

యంగ్‌ ఏజ్‌లోనే  పెద్ద వాళ్లలా కనిపిస్తున్నారా?.. ఈ అలవాట్లే ప్రధాన కారణం! తస్మాత్ జాగ్రత్త!
Youthful Skin
Anand T
|

Updated on: Dec 14, 2025 | 6:18 PM

Share

ఈ మధ్య చాలా మందిలో వయస్సుపై చర్చ జరుగుతుంది. కొందరు ఎంత పెద్దవారైనా యవ్వనంగా కనిపిస్తారు, కానీ కొంతమంది మాత్రం చిన్న వయసులోనే 40, 50 ఏళ్లలో ఉన్నట్లు కనిపిస్తారు. ఇందుకు కారణంగా వారి రోజువారీ జీవితంలోని అలవాట్లేనని నిపుణులు అంటున్నారు. అవును, రోజువారీ జీవితంలోని కొన్ని అలవాట్లు చాలా ప్రమాదకరమైనవి, అవి మీ వాస్తవ వయస్సు కంటే పెద్దవారిగా కనిపించేలా చేస్తాయి. కాబట్టి ఆ అలవాట్లను వెంటనే మానేసి.. ఆరోగ్యంగా యవ్వనంగా ఎలా కనిపించాలో ఇక్కడ తెలుసుకుందాం.

చిన్న వయస్సులో పెద్దవారిగా కనిపించేలా చేసే అలావాట్లు

ఒత్తిడి: నిరంతరం ఒత్తిడి మానసిక ఆరోగ్యానికి హానికరం మాత్రమే కాదు, దాని ప్రభావాలు ముఖంపై కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఒత్తిడి మీ చర్మాన్ని అలసిపోయేలా చేసి, అకాల వృద్ధాప్యానికి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి మీరు ఎల్లప్పుడు, ప్రశాంతంగా మనఃశాంతిగా ఉండేందుకు ప్రయత్నించండి

ఆలస్యంగా నిద్రపోవడం: రాత్రి ఎక్కువ సమయం మేల్కోవడం, ఆలస్యంగా నిద్ర లేకపోవడం చర్మంపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. అందువల్ల, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవడం చాలా అవసరం.

జంక్ ఫుడ్: మీరు ఎక్కువగా స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే, దాని ప్రత్యక్ష ప్రభావం మీ ముఖంపై కనిపిస్తుంది. చక్కెర చర్మం వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. అలాగే ఇది అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. అందువల్ల, పుష్కలంగా కూరగాయలు, పండ్లు తినండి, నీటిని ఎక్కువగా తాగండి, రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగడం అలవాటు చేసుకోండి.

సన్‌స్క్రీన్ అప్లై చేయకపోవడం: చాలా మంది ఇంట్లో ఉన్నప్పుడు సన్‌స్క్రీన్ అప్లై చేయరు. ఇలా చేయడం వల్ల మన చర్మంపై ప్రభావం పడవచ్చు. అవును UV కిరణాలు ఇంటి లోపల కూడా మన చర్మాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు అంటున్నారు. అందువల్ల, వాతావరణం ఎలా ఉన్నా, ప్రతిరోజూ మీ ముఖానికి సన్‌స్క్రీన్ అప్లై చేయడం ముఖ్యం.

ధూమపానం, మద్యం సేవించడం: అతిగా ధూమపానం. మద్యం సేవించడం కూడా అకాల వృద్ధాప్యానికి ప్రధాన కారణాలు అని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఈ చెడు అలవాట్లను మానేయడం మీ చర్మానికి, ఆరోగ్యానికి చాలా మంచిది. వీటికి బదులుగా ఎక్కువగా నీరు తాగేందుకు ప్రయత్నించండి. ఇది మీ చర్మాన్ని డీహైడ్రెడ్ కాకుండా కాపాడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.