Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Street View: గ్రామీణ ప్రజలకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. ఇక మ్యాప్‌లో ‘స్ట్రీట్ వ్యూ ఫీచర్‌’.. దీని ప్రయోజనం ఏమిటి?

గూగుల్‌ మ్యాప్‌లో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న స్ట్రీట్ వ్యూ ఫీచర్ ఇప్పుడు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ప్రారంభంలో భారతదేశంలోని 10 ప్రధాన నగరాల్లోని వినియోగదారులు దీనిని ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్‌ను 2016 లోనే భారతదేశంలో ప్రారంభించాల్సి ఉంది..

Google Street View: గ్రామీణ ప్రజలకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. ఇక మ్యాప్‌లో 'స్ట్రీట్ వ్యూ ఫీచర్‌'.. దీని ప్రయోజనం ఏమిటి?
Google Street View
Follow us
Subhash Goud

|

Updated on: May 29, 2023 | 5:15 AM

గూగుల్‌ మ్యాప్‌లో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న స్ట్రీట్ వ్యూ ఫీచర్ ఇప్పుడు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ప్రారంభంలో భారతదేశంలోని 10 ప్రధాన నగరాల్లోని వినియోగదారులు దీనిని ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్‌ను 2016 లోనే భారతదేశంలో ప్రారంభించాల్సి ఉంది. అయితే భద్రతా ప్రయోజనాలకు ముప్పు వాటిల్లుతుందని భారత ప్రభుత్వం ఈ ఫీచర్‌ను ప్రారంభించడాన్ని వ్యతిరేకించింది. ఆ తర్వాత గతేడాది బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, పూణే, నాసిక్, నగరాల్లో ఈ ఫీచర్ విడుదలైంది. ఇది వడోదర, అహ్మద్‌నగర్, అమృత్‌సర్ నగరాల్లో అందుబాటులో ఉంది.

ఇప్పుడు ఈ సేవ దేశంలోని చిన్న గ్రామాలు, పట్టణాలతో సహా దాదాపు అన్ని నగరాల్లో అందుబాటులో ఉంది. గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఇంట్లో కూర్చొని ల్యాండ్‌మార్క్‌లను అన్వేషించవచ్చు. అదేవిధంగా ఏదైనా రెస్టారెంట్ లేదా ఏరియా చుట్టూ వర్చువల్‌గా తిరగవచ్చు. దీని ద్వారా మీరు చుట్టూ తిరిగే అనుభూతిని పొందవచ్చు. గూగుల్‌ మ్యాప్‌ ఇప్పుడు వేగ పరిమితి, రోడ్‌బ్లాక్‌లు, సంబంధిత రహదారిపై అడ్డంకులు, స్థానిక ట్రాఫిక్ అధికారుల సహకారంతో మెరుగైన ఆప్టిమైజ్ చేయబడిన ట్రాఫిక్ లైట్ల గురించి సమాచారాన్ని చూపడంలో సహాయపడుతుంది.

గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ మనం చూడాలనుకుంటున్న స్థలం వీధి స్థాయి ఫోటోలను అందిస్తుంది. ముఖ్యంగా పర్యాటకులు ఒక ప్రదేశాన్ని మొదటిసారి సందర్శిస్తున్నప్పుడు ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం చూడాలనుకున్న ప్రదేశం ముందుగానే ఎలా ఉంటుందో వీధి స్థాయి నుంచి మనం చూడవచ్చు. అంతే కాదు అది చూపే అదే ఫోటోను 360 -డిగ్రీల కోణం నుంచి చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్‌తో వీధి ఎలా ఉంటుంది ?

ఆ వీధిలో ఏ దుకాణాలు ఉన్నాయి ? అనేదానిని చూపిస్తుంది. ఉదాహరణకు బెంగుళూరులో గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్‌ని ఉపయోగిస్తే మ్యాప్‌లో నీలం రంగులో కొన్ని కొత్త చుక్కలు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేస్తే ఆ ప్రాంతానికి సంబంధించిన వీధులు, దుకాణాలు, ఇళ్లకు సంబంధించిన హై క్వాలిటీ 360 డిగ్రీ చిత్రాలను చూడవచ్చు. భారతదేశంలో గూగుల్ స్ట్రీట్ వ్యూను అమలు చేయడానికి గూగుల్ జెనెసిస్ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. టెక్ మహీంద్రా , ఒక అధునాతన మ్యాపింగ్ సొల్యూషన్స్ కంపెనీ, కన్సల్టింగ్, బిజినెస్ రీ – ఇంజనీరింగ్ సేవలు, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం పరిష్కారాలను అందించే ప్రముఖ ప్రొవైడర్.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి