Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rs 2,000 Bank Rules: రూ.2000 నోట్లను మార్చుకోవాలంటే ఏ బ్యాంకులో ఎలాంటి నిబంధనలున్నాయ్‌

ఆర్‌బీఐ అధికారికంగా రూ .2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంది. ఈ నోట్లను కలిగి ఉన్నవారు 6 నెలలలోపు (2023 సెప్టెంబర్ 30వ తేదీ) మార్చుకోవడానికి సమయం ఉంది. ప్రజలు పెద్దగా ఇబ్బంది లేకుండా రూ. 2000 నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. ఖాతాలో జమ..

Rs 2,000 Bank Rules: రూ.2000 నోట్లను మార్చుకోవాలంటే ఏ బ్యాంకులో ఎలాంటి నిబంధనలున్నాయ్‌
Rs 2,000 Bank Rules
Follow us
Subhash Goud

|

Updated on: May 28, 2023 | 7:09 AM

ఆర్‌బీఐ అధికారికంగా రూ .2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంది. ఈ నోట్లను కలిగి ఉన్నవారు 6 నెలలలోపు (2023 సెప్టెంబర్ 30వ తేదీ) మార్చుకోవడానికి సమయం ఉంది. ప్రజలు పెద్దగా ఇబ్బంది లేకుండా రూ. 2000 నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. ఖాతాలో జమ చేయకుండా నోట్ల మార్పిడికి కొన్ని పరిమితులు ఉన్నాయి. కొన్ని బ్యాంకులు కరెన్సీ మార్పిడి కోసం ప్రత్యేక స్లిప్‌తో సహా కొన్ని నియమాలను కలిగి ఉన్నాయి. కొన్ని బ్యాంకుల్లో ప్రజలు ఫారమ్ అవసరం లేకుండా నోట్లను మార్చుకోవచ్చు .ఏదైనా బ్యాంకు నిబంధనల గురించిన తెలుసుకోండి.

ఎస్‌బీఐలో 2,000 రూపాయల నోటును ఎలా మార్చుకోవాలి ?

కొన్ని రోజుల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఎవరైనా తమ బ్యాంక్‌లోని ఏదైనా బ్రాంచ్‌లో రూ.2,000 నోట్లను మార్చుకోవడానికి వస్తే వారు ఎలాంటి ఫారం లేదా ఐడి ప్రూఫ్ అడగకుండా నోటును మార్చుకోవాలి. అంటే మీరు ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా కేవలం రూ.2,000 నోటును తీసుకుంటే బదులుగా ఇతర నోట్లతో తిరిగి ఇవ్వవచ్చు.

పీఎన్‌బీ బ్యాంక్‌లో నిబంధనలు..

ఎస్‌బీఐ లాగానే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా రూ.2,000 నోటును మార్చడానికి ఎటువంటి ID రుజువును అందించాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

ఇతర బ్యాంకుల్లో..

ఎస్‌బీఐ, పీఎన్‌బీ, కెనరా బ్యాంక్, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా రూ. 2,000 నోట్లను మార్చడానికి ఎలాంటి నిబంధనలు లేవు. మీరు ఐడీ ఫ్రూప్‌ను అందించాల్సిన అవసరం లేదు. ఎలాంటి స్లిప్ నింపాల్సిన అవసరం లేదు.

రూ.2,000 నోట్ల మార్పిడికి పత్రాలు అడిగే బ్యాంకులు:

కోటక్, హెచ్ ఎస్ బీసీ బ్యాంకులు తమ ఖాతాదారుల నుంచి రూ.2000 నోట్లను సేకరించి వారి ఖాతాల్లో జమ చేస్తున్నాయి. కానీ ఇతర వ్యక్తులు వచ్చినప్పుడు ఆధార్ వంటి ID రుజువును అందించమని అడుగుతారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా ID ప్రూఫ్ అడగడం లేదు. అయితే స్లిప్ రాసి సమర్పించాల్సి ఉంటుంది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లలో, ప్రతి ఒక్కరూ ఫారమ్‌ను పూరించి సమర్పించాలి. వారి బ్యాంకులో ఖాతా లేకుంటే వారు ID రుజువును సమర్పించాలి.

రూ .2000 నోటు మార్పిడిపై ఆంక్షలు:

ఏ బ్యాంకుకు వెళ్లినా రూ.2000 నోటు మార్చుకోవచ్చు. మీరు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయాలనుకుంటే మీరు ఏదైనా బ్యాంక్ శాఖకు వెళ్లవచ్చు. నోట్ల మార్పిడి విషయంలో ఒక రోజులో 10 నోట్ల పరిమితి ఉంటుంది. ఎస్‌బీఐ వంటి కొన్ని బ్యాంకులకు ఈ పరిమితి లేదు. ఒకేసారి 10 నోట్లను మార్చుకోవడానికి పరిమితి ఉంది. కానీ మీరు క్యూలో తిరిగి వచ్చి 10 నోట్లను మార్చుకోవచ్చు. అదే విధంగా అవసరమైనన్ని సార్లు పునరావృతం చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి