మొబైల్ ప్రియుల మనసు దోచేస్తున్న శామ్‌సంగ్ ఎఫ్ 62.. ధర కూడా అందుబాటులోనే.. మార్కెట్లోకి ఎప్పుడు రానుందంటే..?

Samsung Galaxy F62: మొబైల్ దిగ్గజం శాంసంగ్ మరో సరికొత్త గెలాక్సీ మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. శామ్‌సంగ్ గతేడాది ప్రవేశపెట్టిన ఎఫ్-సిరీస్‌ గెలాక్సీ ఫోన్లకు కొనసాగింపుగా ఎఫ్ 62ను..

  • Shaik Madarsaheb
  • Publish Date - 12:00 am, Tue, 16 February 21
మొబైల్ ప్రియుల మనసు దోచేస్తున్న శామ్‌సంగ్ ఎఫ్ 62.. ధర కూడా అందుబాటులోనే.. మార్కెట్లోకి ఎప్పుడు రానుందంటే..?

Samsung Galaxy F62: మొబైల్ దిగ్గజం శాంసంగ్ మరో సరికొత్త గెలాక్సీ మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. శామ్‌సంగ్ గతేడాది ప్రవేశపెట్టిన ఎఫ్-సిరీస్‌ గెలాక్సీ ఫోన్లకు కొనసాగింపుగా ఎఫ్ 62ను ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ మార్కెట్‌లోకి రాగానే ట్రెండింగ్‌గా మారింది. Samsung Galaxy F62 ఫోనులో ప్రధానంగా భారీ సామర్ధ్యం గల 7,000ఎంఏహెచ్ బ్యాటరీని తీసుకొచ్చారు. ఇప్పటికే 7,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో శామ్‌సంగ్ గెలాక్సీ ఎం51 స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. అయితే.. మధ్యస్థితి కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని ఎఫ్ 62 అందుబాటులోకి తీసుకొచ్చారు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్62లో ఎక్సినోస్ 9825 ప్రాసెసర్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్, భారీ బ్యాటరీ సామర్థ్యం వంటి ప్రత్యేకతలతో 6, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరెజ్‌తో మార్కెట్లోకి తీసుకువచ్చారు.

ఈ శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్62 సేల్ ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 12గంటలకు మార్కెట్లోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్, శామ్‌సంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు రిలయన్స్ డిజిటల్, జియో రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానుంది. ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ ప్రారంభమవుతుందని శామ్‌సంగ్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించాయి. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనేవారికి రూ.2,500 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు శామ్‌సంగ్, రిలయన్స్ బ్రాండ్ కూపన్‌లపై కూడా ఆఫర్‌ను ప్రకటించారు.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 ప్రత్యేకతలు ఇవే..
డిస్‌ప్లే: 6.7 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్
బ్యాటరీ: 7,000ఎంఏహెచ్
ఫాస్ట్ ఛార్జింగ్: 25వాట్
ర్యామ్: 6జీబీ, 8జీబీ
స్టోరేజ్: 128జీబీ
బ్యాక్ కెమెరా: 64 ఎంపీ + 12 ఎంపీ + 5 ఎంపీ + 5 ఎంపీ, సెల్ఫీ కెమెరా: 32 మెగాపిక్సెల్
కలర్స్: బ్లూ, గ్రీన్, గ్రే కలర్
ధరలు: 6జీబీ+128జీబీ – రూ.23,999 ; 8జీబీ+128జీబీ – రూ.25,999

Also Read:

Valentine’s Day: అమెజాన్ వాలైంటైన్స్ డే స్పెషల్ ఆఫర్.. ఆపిల్ డేస్ సేల్‌లో డిస్కౌంట్‌లో ఐఫోన్లు..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌కు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోన్న టిక్‌టాక్.. ఆల్గారిథమ్‌తో చెక్ పెట్టనున్న టెక్ దిగ్గజం..