Valentine’s Day: అమెజాన్ వాలైంటైన్స్ డే స్పెషల్ ఆఫర్.. ఆపిల్ డేస్ సేల్‌లో డిస్కౌంట్‌లో ఐఫోన్లు..

Amazon India: అమెజాన్ ఇండియా సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. వాలైంటైన్స్ డే సందర్భంగా ఐఫోన్లపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ‘ఆపిల్ డేస్ సేల్‌’లో భాగంగా.. ఐఫోన్ 12 మినీ,..

Valentine’s Day: అమెజాన్ వాలైంటైన్స్ డే స్పెషల్ ఆఫర్.. ఆపిల్ డేస్ సేల్‌లో డిస్కౌంట్‌లో ఐఫోన్లు..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 14, 2021 | 6:27 AM

Amazon India: అమెజాన్ ఇండియా సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. వాలైంటైన్స్ డే సందర్భంగా ఐఫోన్లపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ‘ఆపిల్ డేస్ సేల్‌’లో భాగంగా.. ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 11 ప్రో సిరీస్, ఐఫోన్ 7 తో పాటు పలు గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఆపిల్ డేస్ కింద ఈ ఆఫర్ ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతుందని అమెజాన్ శనివారం తెలిపింది. ‘ఆపిల్ డే సేల్’ కింద కంపెనీ వినియోగదారులకు అతి తక్కువ ధరలకు ఐఫోన్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వినియోగదారులు ఐఫోన్ 12 మినీ మొబైల్‌ను రూ.5,410 తగ్గింపుతో రూ .64,490 ధరతో పొందవచ్చని అమెజాన్ శనివారం తెలిపింది. అంతేకాకుండా ఐఫోన్ 11 ప్రో రూ.82,900 కే లభించనుంది.

దీంతోపాటు వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం వినియోగదారులకు గొప్ప ఆఫర్లను ప్రకటించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి రూ.9,000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. ఈ ఆఫర్ ఫిబ్రవరి 14 వరకు మాత్రమే ఉంది. అంతేకాకుండా పలు ఆపిల్ పరికరాల కొనుగోళ్లపై కూడా ఆఫర్లను ప్రకటించింది.

Also Read:

Big Breaking: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మీని బస్సును ఢీకొన్న లారీ.. 14 మంది మృతి

Tamil Nadu: విరుదునగర్‌ ఘటనలో 19కి పెరిగిన మృతుల సంఖ్య.. ఇంకా విషమంగానే పలువురి పరిస్థితి