Instagram: ఇన్‌స్టాగ్రామ్‌కు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోన్న టిక్‌టాక్.. ఆల్గారిథమ్‌తో చెక్ పెట్టనున్న టెక్ దిగ్గజం..
Instagram Algorithm For TikTok Issue: అతి తక్కువ సమయంలో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్న యాప్‌లలో టిక్‌టాక్ ఒకటి. ఎంతో మంది ఔత్సాహికులు ఈ యాప్ ద్వారా సెలబ్రిటీలుగా మారారు. అంతేకాకుండా...
Instagram Algorithm For TikTok Issue: అతి తక్కువ సమయంలో ఎక్కువగా క్రేజ్ సంపాదించుకున్న యాప్‌లలో టిక్‌టాక్ ఒకటి. ఎంతో మంది ఔత్సాహికులు ఈ యాప్ ద్వారా సెలబ్రిటీలుగా మారారు. అంతేకాకుండా చైనాలో పుట్టిన ఈ యాప్‌కు భారత్‌లోనే ఎక్కువ ఫాలోవర్లు ఉండడం మరో విశేషం. ఇదిలా ఉంటే భారత్‌లో టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధించడంతో దీని నిర్వాహకులపై బాగానే ప్రభావం పడింది. ఇక టిక్‌టాక్‌లేని లోటును తీరుస్తూ భారత్‌లో చాలా యాప్‌లు పుట్టుకొచ్చాయి. అంతేకాకుండా అప్పటికే ఉన్న కొన్ని సోషల్ మీడియా సైట్‌లు కూడా టిక్‌టాక్‌ను పోలిన ఫీచర్లను తీసుకురావడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్ ‘రీల్స్‘ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌కు ఇక్కడే కొత్త సమస్య ఎదురైంది. టిక్‌టాక్‌లో రూపొందించిన వీడియోలు రీల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. దీంతో చాలా మంది టిక్‌టాక్‌లో రూపొందించిన వీడియోలను రీల్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలు టిక్‌టాక్ వాటర్ మార్క్‌తో కనిపిస్తుండడంతో.. ఎక్కువ కాపీ కంటెంట్ పోస్ట్ అవుతోందని ఇన్‌స్టాగ్రామ్ భావిస్తోంది. ఈ క్రమంలోనే టిక్‌టాక్ యాప్‌లో రూపొందించిన వీడియోలు ‘రీల్స్‘లో అప్‌లోడ్ కాకుండా ఉండేందుకు అల్గారిథమ్ రూపొందించే పనిలో పడింది. త్వరలోనే ఈ ఫీచర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
Also Read: Postal APP: ఖాతా తెరవడానికి పోస్టాఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..