AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tele Cubes: టెలిఫోన్ బూత్‌లను పోలిన ‘టెలీ క్యూబ్‌’లను ప్రవేశ పెట్టిన జపాన్.. వీటి ఉపయోగం ఏంటంటే..

Japan Introduce Tele cubes: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంది. అందులో ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్. అంతకు ముందు కూడా ఈ విధానం అందుబాటులో ఉన్నా.. అది కొన్ని కంపెనీలకు మాత్రమే...

Tele Cubes: టెలిఫోన్ బూత్‌లను పోలిన ‘టెలీ క్యూబ్‌’లను ప్రవేశ పెట్టిన జపాన్.. వీటి ఉపయోగం ఏంటంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 14, 2021 | 6:42 PM

Japan Introduce Tele cubes: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంది. అందులో ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్. అంతకు ముందు కూడా ఈ విధానం అందుబాటులో ఉన్నా.. అది కొన్ని కంపెనీలకు మాత్రమే పరిమితమై ఉండేది. అయితే కరోనా తర్వాత మునుపెన్నడూ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అనుసరించని కంపెనీలు కూడా ఈ పద్ధతిని పాటించడం ఆరంభించాయి. అయితే ఓ ఉద్యోగి రైల్వే స్టేషన్‌లోనో, బస్‌స్టాప్‌లో ఉన్న సమయంలో అనుకోకుండా ఆఫీస్ వర్క్ చేయాల్సి వస్తుంది. లేదా అర్జెంట్‌గా వీడియో కాల్ మాట్లాడాల్సి వస్తుంది. బయట రద్దీ ప్రదేశాల్లో ఇది వీలుకాకపోతుండొచ్చు. అలా కాకుండా రద్దీ ప్రదేశాల్లో.. ఒక ప్రత్యేక గది అందులో పవర్ కనెక్షన్ ఉంటే భలే ఉంటుంది కదూ..? అచ్చంగా ఇలాంటి ఆలోచనే చేసింది జపాన్. ఇందులో భాగంగానే టెలీక్యూబ్‌ల పేరుతో ఒక సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల దగ్గర టెలిఫోన్ బూతులను పోలి ఉండే ఈ టెలీ క్యూబ్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో టెలీక్యూబ్‌లో ఒకటి నుంచి నాలుగు గదలుంటాయి. వీటిలో ఒక సోఫా, ల్యాప్‌టాప్ పెట్టుకోవడానికి వీలుగా ఓ డెస్క్.. విద్యుత్ సరఫరా అందుబాటులో ఉంటుంది. దీంతో ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా ఎంచక్కా ఆఫీసు వర్క్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. నిజానికి ఈ టెలీ క్యూబ్‌లను 2018లోనే ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ మిత్సుబుషి తీసుకొచ్చింది. 2019లో వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. ఇక కరోనా సమయంలో వీటికి డిమాండ్ పెరగడంతో వీటి సంఖ్యను పెంచారు. ప్రస్తుతం జపాన్ వ్యాప్తంగా ఇలాంటి టెలీ క్యూబ్‌లను వందకుపైగా ఏర్పాటు చేశారు. మరి భారత్‌లో ఇలాంటి టెలీ క్యూబ్‌లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో చూడాలి.

Also Read: My Map India: గూగుల్‌ ప్రత్యామ్నాయంగా రానున్న దేశీయ ‘మ్యాప్స్‘… ‘ఇస్రో‘ సహకారంతో..