Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp : మీది లక్షలకోట్లు విలువజేసే కంపెనీ కావచ్చు ప్రజల వ్యక్తిగత గోప్యతే ముఖ్యమన్న సుప్రీం కోర్టు..

సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్, ఫేస్ బుక్ లకు సుప్రీం కోర్టు నోటీసులను జారీ చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ వ్యవహారంపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ ఇన్‌స్టాంట్ మెసేజింగ్...

Whatsapp : మీది లక్షలకోట్లు విలువజేసే కంపెనీ కావచ్చు ప్రజల వ్యక్తిగత గోప్యతే ముఖ్యమన్న సుప్రీం కోర్టు..
Follow us
Surya Kala

|

Updated on: Feb 15, 2021 | 2:56 PM

Whatsapp privacy policy: సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్, ఫేస్ బుక్ లకు సుప్రీం కోర్టు నోటీసులను జారీ చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ వ్యవహారంపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ కొత్త ప్రైవ‌సీ పాల‌సీపై దాఖ‌లైన పిటిష‌న్‌పై సుప్రీం విచార‌ణ జ‌రిపింది. నాలుగు వారాల్లో నోటీసుల‌కు స‌మాధానం ఇవ్వాల‌ని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల‌ను ఆదేశించింది. ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు ఆ సంస్థ‌కు చుర‌క‌లు అంటించింది.

మీది లక్షల కోట్ల డాలర్ల కంపెనీ కావచ్చు. కానీ ప్రజల వ్యక్తిగత గోప్యత అనేది అంతకంటే విలువైంది.. దానిని రక్షించే బాధ్యత మా మీద ఉంది అంటూ చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మీ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల తమ గోప్యతకు భంగం వాటిల్లుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాము ఎవరో ఒకరికి పంపిన సందేశాలను వాట్సాప్‌, ఫేస్‌బుక్‌తో పంచుకోవడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రైవసీని కాపాడటం కోసం మేం తప్పక జోక్యం చేసుకుంటామని తెలిపింది. ఇందుకు సంబంధించి కేంద్రంతో పాటు, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇండియాలో వాట్సాప్ తన కొత్త ప్రైవసీ పాలసీని అమలు చేయకుండా ఆదేశించాలని ఆ పిటిషన్ కోరింది. యురోపియన్ యూనియన్‌లో అమలు చేస్తున్న పాలసీనే ఇక్కడా అమలు చేయాల్సిందిగా కూడా ఆ పిటిషన్ అభ్యర్థించింది.ఇక వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ తరఫున కపిల్‌ సిబాల్‌, అరవింద్‌ దాతర్‌ తమ వాదనలు వినిపించారు. ప్రైవసీకి భంగం కలుగుతుందనే ఆరోపణలు వాస్తవం కాదని తెలిపారు.

Also Read:

యూటీ ప్రకటనతో రాజకీయ కలకలం.. అసదుద్దీన్ వ్యూహమేంటి? రాజకీయ రచ్చకు రీజనేంటి?

మీ మొబైల్‌లో ‘స్లాక్‘ యాప్ ఉందా..? అయితే వెంటనే ఈ పనిచేయండి..

ఈ రైలు ప్రయాణికుల పాలిట అన్నపూర్ణ..
ఈ రైలు ప్రయాణికుల పాలిట అన్నపూర్ణ..
ఆల్కహాల్ లాగానే.. ఈ 5 ఆహారాలు లివర్‌కు యమ డేంజర్.. జర భద్రం..
ఆల్కహాల్ లాగానే.. ఈ 5 ఆహారాలు లివర్‌కు యమ డేంజర్.. జర భద్రం..
నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..
మీ లివర్ పాడైపోకుండా ఉండాలంటే ఈ మ్యాజిక్ డ్రింక్స్ ని తీసుకోండి
మీ లివర్ పాడైపోకుండా ఉండాలంటే ఈ మ్యాజిక్ డ్రింక్స్ ని తీసుకోండి
బాత్రూం ఎప్పుడూ ఫ్రెష్‌ గా ఉండాలంటే.. ఈ చిన్న పనులు చేస్తే చాలు
బాత్రూం ఎప్పుడూ ఫ్రెష్‌ గా ఉండాలంటే.. ఈ చిన్న పనులు చేస్తే చాలు
నోరూరించే సేమ్యా చక్కర పొంగలిని క్షణాల్లో చేసుకోండి.. రెసిపీ
నోరూరించే సేమ్యా చక్కర పొంగలిని క్షణాల్లో చేసుకోండి.. రెసిపీ