Upcoming Smartphones: ఒకటి కాదు.. రెండు కాదు.. ఈ వారం విడుదల కానున్న 5 పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌లు!
Upcoming Smartphones: భారతదేశంలో ఒకటి లేదా రెండు కాదు, ఐదు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. నవంబర్ 17-23 మధ్య వివో, రియల్‌మీ, స్వదేశీ లావా వంటి బ్రాండ్లు తమ తాజా ఫోన్‌లను ఆవిష్కరిస్తాయి. ఒప్పో ఫైండ్ X9 సిరీస్‌ను పరిచయం చేయనుండగా..

Upcoming Smartphones: మీరు పాత ఫోన్ నుండి కొత్తదానికి అప్‌గ్రేడ్ కావాలని చూస్తున్నట్లయితే ఈ వారం మీకు మంచి అవకాశం. ఎందుకంటే ఈ వారం భారతదేశంలో ఒకటి లేదా రెండు కాదు, ఐదు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. నవంబర్ 17-23 మధ్య వివో, రియల్‌మీ, స్వదేశీ లావా వంటి బ్రాండ్లు తమ తాజా ఫోన్‌లను ఆవిష్కరిస్తాయి. ఒప్పో ఫైండ్ X9 సిరీస్‌ను పరిచయం చేయనుండగా, రియల్‌మే దాని ఫ్లాగ్‌షిప్ GT8 ప్రోను విడుదల చేస్తుంది.
- వూబుల్ 1 5G: కొత్త భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్, ఇండ్‌కాల్ టెక్నాలజీస్, నవంబర్ 19న వూబుల్ 1 5G అనే దాని మొదటి ఫోన్‌తో మార్కెట్లోకి ప్రవేశిస్తుంది. ఇది 2.6GHz మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్, 8GB RAM, 256GB వరకు స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ 50MP OIS ప్రధాన సెన్సార్, 16MP సెల్ఫీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. ఇది పూర్తిగా భారతదేశంలోనే తయారు అవుతుంది. అలాగే దీని ధర రూ.15,000 నుండి రూ.20,000 మధ్య ఉంటుందని భావిస్తున్నారు.
- లావా అగ్ని 4: ఈ లావా స్మార్ట్‌ఫోన్ నవంబర్ 20, 2025న లాంచ్ అవుతుంది. అల్యూమినియం ఫ్రేమ్‌తో కూడిన ఈ హ్యాండ్‌సెట్ వినియోగదారులకు అనేక AI ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత అమెజాన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.
- Oppo Find X9: ఈ Oppo ఫోన్ నవంబర్ 18 మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అయ్యింది. AI ఫ్లాగ్‌షిప్ కెమెరా కలిగిన ఈ ఫోన్‌లో 7025mAh బ్యాటరీ, MediaTek Dimensity 9500 ప్రాసెసర్, 50-మెగాపిక్సెల్ ప్రో-లెవల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
- Oppo Find X9 Pro: నవంబర్ 18న లాంచ్ అయ్యింది. ఈ ఫోన్‌లో AI ఫ్లాగ్‌షిప్ కెమెరా, ColorOS 16 ఉంటాయి. లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ అమెజాన్‌తో పాటు కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా అమ్మకానికి ఉంటుంది.
- Realme GT8 Pro: నవంబర్ 20న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానున్న ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 200-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 7,000mAh బ్యాటరీ ఉంటాయి.
ఇవి కూడా చదవండి
Success Story: ఈ ఎద్దు ఒక రైతును లక్షాధికారిని చేసింది.. రూ.50 లక్షల ఫార్చ్యూనర్‌ను గెలుచుకుంది!
ఇది కూడా చదవండి: SBI నుండి రూ. 60 లక్షల గృహ రుణం తీసుకోవడానికి మీ జీతం ఎంత ఉండాలి. EMI ఎంత?
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








