స్టార్టప్‌లకు ఆటా ప్రోత్సాహం.. ఐఐటీ హైదరాబాద్‌లో ఘనంగా పిచ్‌డే వేడుకలు..!
ఐటీ రంగంలో స్టార్టప్ కంపెనీలను అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ప్రోత్సహించడం అభినందనీయం అని పలువురు ఐటీ రంగ ప్రముఖులు కొనియాడారు. శనివారం (డిసెంబర్ 13) అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ‘ఆటా వేడుకలు–2025’లో భాగంగా ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (విద్యాశాఖ), ఐఐటీ హైదరాబాద్ సహకారంతో ఐఐటీ క్యాంపస్‌లో ఆటా స్టార్టప్ పిచ్ డే కార్యక్రమం నిర్వహించారు.

ఐటీ రంగంలో స్టార్టప్ కంపెనీలను అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ప్రోత్సహించడం అభినందనీయం అని పలువురు ఐటీ రంగ ప్రముఖులు కొనియాడారు. శనివారం (డిసెంబర్ 13) అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ‘ఆటా వేడుకలు–2025’లో భాగంగా ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (విద్యాశాఖ), ఐఐటీ హైదరాబాద్ సహకారంతో ఐఐటీ క్యాంపస్‌లో ఆటా స్టార్టప్ పిచ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఉత్తమ స్టార్టప్‌లకు నిధుల అవకాశాలు, మెంటార్షిప్, పరిశ్రమల అనుసంధానం కల్పించడమే లక్ష్యంగా ఈ పిచ్ డే నిర్వహించామని ఆటా ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా స్టార్టప్ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, విద్యా సంస్థలు, ఐటీ రంగ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. స్టార్టప్‌లను ప్రోత్సహించడం, వాటికి నిధులు, దిశ నిర్దేశం అందించడం, గ్లోబల్ నెట్‌వర్క్‌ను నిర్మించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయంరెడ్డి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు
దేశంలో స్టార్టప్ ఎకోసిస్టం వేగంగా విస్తరిస్తోందని, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు, మైతీ స్టార్టప్ హబ్ అందిస్తున్న సహకారం వల్ల యువ ఇంజనీర్లకు అనేక అవకాశాలు లభిస్తున్నాయని మైతీ స్టార్టప్ హబ్ సీఈఓ డా. పన్నీర్ సెల్వం మదనగోపాల్ పేర్కొన్నారు. టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలే భవిష్యత్ ఆర్థిక వృద్ధికి పునాదని స్పష్టం చేశారు. అలాగే ఎఐ కూడా భవిష్యత్‌కు నూతన నాంది పలుకుతుందన్నారు.
ఈ సందర్భంగా స్కేలింగ్ స్టార్టప్స్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చ ఆకట్టుకుంది. స్టార్టప్‌లు ఎదగడంలో ఎదురయ్యే సవాళ్లు, పెట్టుబడుల సమీకరణ, మార్కెట్ విస్తరణ, టెక్నాలజీ వాణిజ్యయీకరణ, గ్లోబల్ భాగస్వామ్యాలపై వారి అభిప్రాయాలను ప్రతినిధుులు వివరించారు. అలాగే పిచ్ డేలో పాల్గొన్న స్టార్టప్‌లు తమ వ్యాపార ఆలోచనలు, ఉత్పత్తులు, సేవలను కాంపిటీషన్ న్యాయనిర్ణేతలు పరీక్షించి, ఉత్తమ స్టార్టప్‌లను.ఎంపిక చేశారు. భారతదేశం–అమెరికా మధ్య స్టార్టప్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడంలో ఆటా స్టార్టప్ పిచ్ డే కీలక మైలురాయిగా చరిత్రలో నిలుస్తుందనిఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




