ఛార్జింగ్ మాస్క్ వాడితే వైరస్ అంతమవుతుందట..!

కరోనా వైరస్ వ్యాప్తికి మాస్క్ కొంత రక్షణగా నిలుస్తోంది. వైరస్ దరి చేరకుండా ఉండాలంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తప్పనిసరి అయ్యింది. అయితే ప్రతి రోజు మాస్క్ మార్చాలంటే వ్యయంతో పాటు పర్యావరణానికి కూడా హాని కలిగిస్తోంది. ఇందుకు విరుగుడుగా వైరస్ ను అంతం చేసే మాస్క్ ను రూపొందించామంటున్నారు ఇజ్రాయెల్ సైంటిస్టులు. కరోనా వైరస్ ను ఛార్జింగ్ మాస్క్ తో చంపొచ్చని అంటున్నారు. మాస్క్ కు ఫోన్ ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ పెడితే […]

ఛార్జింగ్ మాస్క్ వాడితే వైరస్ అంతమవుతుందట..!
Follow us
Balaraju Goud

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2020 | 3:54 PM

కరోనా వైరస్ వ్యాప్తికి మాస్క్ కొంత రక్షణగా నిలుస్తోంది. వైరస్ దరి చేరకుండా ఉండాలంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం తప్పనిసరి అయ్యింది. అయితే ప్రతి రోజు మాస్క్ మార్చాలంటే వ్యయంతో పాటు పర్యావరణానికి కూడా హాని కలిగిస్తోంది. ఇందుకు విరుగుడుగా వైరస్ ను అంతం చేసే మాస్క్ ను రూపొందించామంటున్నారు ఇజ్రాయెల్ సైంటిస్టులు. కరోనా వైరస్ ను ఛార్జింగ్ మాస్క్ తో చంపొచ్చని అంటున్నారు. మాస్క్ కు ఫోన్ ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ పెడితే ఆ వేడికి కరోనావైరస్ చనిపోతుందంటున్నారు. హైఫాలోని టెక్నియన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం యూఎస్‌బి పోర్టుతో ఉండే మాస్కును తయారుచేసింది. ఆ పోర్టుకు మొబైల్ ఫోన్ ఛార్జర్‌ను అనుసంధానించి 30 నిమిషాలు ఛార్జింగ్ పెడితే ఆ వేడికి మాస్కులోని క్రిములన్నీ చనిపోతాయట. ఛార్జర్ మాస్కులోని కార్బన్ ఫైబర్స్ యొక్క పొరను 70 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తుంది. దీంతో వైరస్ పూర్తిగా అంతమవుతుందంటున్నారు. రీయూజబుల్ మాస్కులను వాడటం ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని, అంతేకాదు మాస్క్ ల కోసం చేసే ఖర్చు కూడా తగ్గుతుందని శాస్త్రవేత్త యైర్ ఐన్-ఎలి తెలిపారు.