AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్.. ఇకపై వాటికి చెక్ పడినట్లే..!

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు పొలిటికల్ యాడ్స్‌ను బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్.. ఇకపై వాటికి చెక్ పడినట్లే..!
Ravi Kiran
|

Updated on: Jun 17, 2020 | 4:52 PM

Share

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వీలుగా ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్ జుకర్‌బెర్గ్‌ ఈ సౌకర్యాన్ని తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు తమ ఫేస్‌బుక్‌ పేజీపై కనిపించే పొలిటికల్ యాడ్స్‌ను చాలా సులువుగా బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

గతంలో పలు వివాదాస్పదమైన రాజకీయ ప్రకటనలు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ప్రదర్శన కావడంతో జుకర్‌బెర్గ్ తీవ్ర విమర్శలు ఎదుర్కున్నారు‌. అయితే రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో అలాంటి తప్పులు జరగకూడదనే ఉద్దేశ్యంతో ‘ఓటింగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా యూజర్లకు అవసరమైన సమాచారం లభిస్తుందని, ఓటు హక్కు కోసం ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి.? ఓటింగ్ కేంద్రం వివరాలు, ఇతరత్రా విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చని జుకర్‌బెర్గ్‌ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుమారు 160 మిలియన్ ప్రజలు ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ఫీడ్స్‌లో చూస్తారని భావిస్తున్న ఆయన.. ఈ సంఖ్యను మరింతగా పెంచి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్ టర్న్ ఔట్ 4 మిలియన్‌కు చేర్చాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.

Also Read:

నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్…

భారత జవాన్ల మరణం తీవ్ర వేదన కలిగించింది…

బ్రేకింగ్: సుశాంత్ కుటుంబంలో మరో విషాదం..

ఏపీ నిట్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. 25 మార్కులకే పరీక్ష!

30 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండాలనుకుంటున్నాః రఘురామకృష్ణంరాజు

‘సుశాంత్‌పై కపట ప్రేమ చూపిస్తున్నారు’.. నెపోటిజంపై సైఫ్ ఫైర్..

అంతర్జాతీయ విమాన సర్వీసులు అప్పుడే.. కేంద్రమంత్రి క్లారిటీ..