AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దినఫలాలు (జూలై 25): ఈ రాశుల వారికి శుభవార్తలు, ఆర్థిక సమస్యలకు చెక్..!

Horoscope Today (July 25, 2026): శనివారం గ్రహస్థితుల ప్రభావంతో 12 రాశుల వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మేష రాశి వారికి ఉద్యోగంలో పురోగతి, వృషభ రాశి వారికి ఆర్థిక ఉపశమనం, మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో అనుకూలతలు పెరగనున్నాయి. మేషం నుంచి మీనం వరకు ప్రతి రాశి వారికి ప్రేమ, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ఆరోగ్యం వంటి అంశాల్లో ఈ రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

దినఫలాలు (జూలై 25): ఈ రాశుల వారికి శుభవార్తలు, ఆర్థిక సమస్యలకు చెక్..!
Horoscope Today 25 July 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 25, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (జూలై 25, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగుతుంది. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి శుభవార్త అందుకుంటారు. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు అందుకుంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుతాయి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగుతుంది. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి శుభవార్త అందుకుంటారు. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగి పోతుంది. ఆదాయం పెరుగుతుంది. మిత్రుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరోగ్యా నికి ఇబ్బంది ఉండదు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. కొత్త ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. కొద్దిపాటి ఆటంకాలున్నప్పటికీ ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. వృత్తి, ఉద్యోగాలు అను కూలంగా పురోగమిస్తాయి. ఉద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపి స్తుంది. బంధుమిత్రులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపా రాల్లో ప్రధాన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఆశించినంతగా లాభాలు అందుకుంటారు. శుభవార్తలు ఎక్కువగా వింటారు. అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసు కుంటుంది. పెళ్లి ప్రయత్నాలకు, అదనపు ఆదాయ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభి స్తుంది. సన్నిహిత బంధుమిత్రులకు ఆర్థికంగా, ఉద్యోగపరంగా సహాయం చేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులను కొందరు మిత్రుల సహాయంతో సకాలంలో పూర్తి చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు బాగా లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలను, కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండక పోవచ్చు. అదనపు ఆదాయ మార్గాలకు సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. తోబుట్టు వులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు బంధువుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

రోజంతా సాధారణంగా సాగిపోతుంది. ఉద్యోగపరంగా చిన్న చిన్న సమస్యలున్నా తేలికగా పరిష్కా రమవుతాయి. వృత్తి జీవితంలో కాస్తంత డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు చవిచూస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరు గ్గానే ఉంటుంది. అనవసర ఖర్చుల్ని మరింతగా తగ్గించుకోవాలి. వ్యక్తిగత సమస్య ఒకటి పరి ష్కారం అవుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రోజంతా ప్రశాంతంగా, ఆశించిన విధంగా సాగిపోతుంది. ఇష్టమైన బంధువులు, సన్నిహితుల్ని కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువ సమయం గడుపుతారు. పిల్లల నుంచి సంతోష కరమైన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువర్గం నుంచి శుభ వార్త అందుతుంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ సలహాలు, సూచనల వల్ల బంధు వులు ప్రయోజనం పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధి కారులు మీ మీద ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లపై పైచేయి సాధిస్తారు. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థిక సహాయం అందిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆలయాలకు వెడతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయానికి లోటుండదు కానీ, కుటుంబ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. ఉద్యోగంలో పదో న్నతికి అవకాశముంది. సహోద్యోగుల నుంచి ఆశించిన సహకారం అందుతుంది. వృత్తి జీవితంలో గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. కొద్దిపాటి అనారో గ్యానికి అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కొందరు బంధువుల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా అనుకూలంగా సాగిపోతుంది. అత్యవసర వ్యవహారాలను సకాలంలో పూర్తి చేయగలుగు తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్య, ఉద్యోగాల విషయంలో విదేశాల నుంచి ఆశిం చిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లకు పని భారం పెరుగుతుంది. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం పరవాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4), శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉండ వచ్చు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక, కుటుంబ విషయాల్లో ఓర్పు, సహనా లతో వ్యవహరించవలసి ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు సర్దుకుంటాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. మిత్రుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఒకటి రెండు సమస్యలు ఎదురైనా, వాటిని తేలికగా పరిష్కరించుకుంటారు. బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆదాయం బాగానే ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టు కోకపోవడం మంచిది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఆశించిన శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దూరపు బంధువు లతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే అనుకోకుండా మంచి ఉద్యోగం లభించే సూచనలున్నాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడతారు.

Follow Us