‘సుశాంత్‌పై కపట ప్రేమ చూపిస్తున్నారు’.. నెపోటిజంపై సైఫ్ ఫైర్..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆకస్మిక మరణం.. ఇప్పుడు బీ-టౌన్‌లో సంచలనంగా మారింది. ఎప్పటి నుంచో ఉన్న గుత్తాధిపత్యం మరోసారి బయటపడింది. కొందరు నెపోటిజం వల్ల సుశాంత్ మరణించాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్న నేపధ్యంలో సీనియర్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ తాజాగా స్పందించారు. సుశాంత్ ఉన్నప్పుడు లేని ప్రేమ.. ఇప్పుడు ఎలా పుట్టుకొచ్చిందని మండిపడ్డారు. ఆత్మవంచన కంటే నిశబ్దంగా ఉండటం మంచిదని ఆయన అన్నారు. సుశాంత్ మరణాన్ని కొంతమంది సొంత లాభం కోసం వాడుకుంటున్నారని.. మరికొందరు […]

'సుశాంత్‌పై కపట ప్రేమ చూపిస్తున్నారు'.. నెపోటిజంపై సైఫ్ ఫైర్..
Follow us

|

Updated on: Jun 16, 2020 | 9:19 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆకస్మిక మరణం.. ఇప్పుడు బీ-టౌన్‌లో సంచలనంగా మారింది. ఎప్పటి నుంచో ఉన్న గుత్తాధిపత్యం మరోసారి బయటపడింది. కొందరు నెపోటిజం వల్ల సుశాంత్ మరణించాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్న నేపధ్యంలో సీనియర్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ తాజాగా స్పందించారు. సుశాంత్ ఉన్నప్పుడు లేని ప్రేమ.. ఇప్పుడు ఎలా పుట్టుకొచ్చిందని మండిపడ్డారు. ఆత్మవంచన కంటే నిశబ్దంగా ఉండటం మంచిదని ఆయన అన్నారు.

సుశాంత్ మరణాన్ని కొంతమంది సొంత లాభం కోసం వాడుకుంటున్నారని.. మరికొందరు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని విమర్శలు గుప్పించారు. సుశాంత్ మరణం ఎంతగానో కలిచివేసింది. అతను మరణించిన వెంటనే చాలామంది స్పందించారు. మనిషి ఉన్నప్పుడు లేని ప్రేమ.? ఇప్పుడు ఎలా పుట్టుకొచ్చింది.? ఇది నిజమో.? కాదో తెలియదు.! లేదా రాజకీయ కోణం ఏదైనా ఉందా అన్నది అర్ధం కావట్లేదు.

సెలబ్రిటీలు ఎవరూ కూడా ఇతరుల బాగోగులు చూడరు. కానీ ఇప్పుడు ఏదో పక్కవారి గురించి పట్టించుకుంటున్నట్లు మాట్లాడుతున్నారు. ఇది నిజంగా ఆత్మవంచన. అవకాశాలు రాకపోవడం వల్లే సుశాంత్ చనిపోయాడని అనడం కరెక్ట్ కాదు.. వేరే ఏదైనా సమస్య ఉండవచ్చునని సైఫ్ ఆలీఖాన్ స్పష్టం చేశారు.

Also Read: 

సుశాంత్‌ను చంపింది వాళ్లే.. కంగనా సంచలన వ్యాఖ్యలు..

బ్రేకింగ్: సుశాంత్ కుటుంబంలో మరో విషాదం..