AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: ఆ ఒక్క సినిమా దిల్ రాజును అంతగా మార్చేసిందా

Dil Raju: ఆ ఒక్క సినిమా దిల్ రాజును అంతగా మార్చేసిందా

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 24, 2026 | 11:49 PM

Share

‘గేమ్ ఛేంజర్’ తర్వాత నిర్మాత దిల్ రాజు వ్యూహం మారినట్లు కనిపిస్తోంది. తెలుగులో భారీ బడ్జెట్ చిత్రాలకు దూరంగా ఉంటూ, మీడియం రేంజ్ హీరోలతో ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రవితేజ, శ్రీ విష్ణు, కళ్యాణ్ రామ్‌లతో సినిమాలు రూపొందిస్తూనే, హిందీలో మాత్రం సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌లతో భారీ ప్రాజెక్టులకు వెనుకాడడం లేదు.

గేమ్ ఛేంజర్ తర్వాత దిల్ రాజు స్ట్రాటజీ మారిందా..? భారీ బడ్జెట్ సినిమాలకు కావాలనే డిస్టేన్స్ మెయింటేన్ చేస్తున్నారా..? హిందీలో వందల కోట్లతో సినిమాలు చేస్తున్న రాజుగారు.. తెలుగులో మీడియం రేంజ్ హీరోలతోనే సర్దుకుపోతున్నారా..? వరసగా అలాంటి ప్రాజెక్ట్స్ సెట్ చేయడం వెనక అసలు కారణమేంటి..? గేమ్ ఛేంజర్ తర్వాత దిల్ రాజులో వచ్చిన మార్పులేంటి..? రెండేళ్ళ కింద దిల్ రాజు బ్యానర్‌లో 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన గేమ్ ఛేంజర్ మామూలు దెబ్బ కొట్టలేదు. ఆ ఒక్క ప్రాజెక్ట్‌తోనే చాలా నష్టపోయారు రాజు అండ్ కో. లక్కీగా అదే సమయంలో సంక్రాంతికి వస్తున్నాం విడుదలై బ్లాక్‌బస్టర్ అయింది కాబట్టి బతికిపోయాం అంటూ స్వయంగా రాజు, శిరీష్‌లే చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గేమ్ ఛేంజర్ తర్వాత మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు దిల్ రాజు. విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన రీజనబుల్ బడ్జెట్‌తోనే వస్తుంది. తెలుగులో ఇలా చేస్తున్నా.. హిందీలో మాత్రం సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లితో ఓ భారీ సినిమా.. అక్షయ్ కుమార్‌తో సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ భారీగానే నిర్మిస్తున్నారు. ఈ రెండింటికి బడ్జెట్ దగ్గర కాంప్రమైజ్ కావట్లేదు రాజు. తెలుగులో మాత్రం బడ్జెట్ కంట్రోలింగ్ చేస్తున్నారు. రవితేజ, శ్రీ విష్ణు, హసిత్ గోలీ కాంబోలో ఓ క్రేజీ మల్టీస్టారర్‌ను 2027 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. దాంతో పాటు కళ్యాణ్ రామ్, పరశురామ్ కాంబినేషన్‌లో ఫ్యామిలీ సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్య ఫ్యామిలీ స్టార్‌తో ఫ్లాపిచ్చినా.. అదే దర్శకుడితోనే హిట్ కొట్టాలని చూస్తున్నారు రాజు. మొత్తానికి గేమ్ ఛేంజర్ ఈ నిర్మాతలో భారీ మార్పులే తెచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

భారతీయులకు నిద్ర కరవు.. షాకింగ్ నిజాలు!

మనుషులను చల్లబరిచే ఫ్రిజ్‌.. లోపల 5 నిమిషాలు కూర్చుంటే చాలు

40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం

Follow Us