AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Chat Transfer: ఆండ్రాయిడ్ టు ఐఫోన్.. వాట్సాప్ డేటా బదిలీ ఇక చాలా ఈజీ..

పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ కు వాట్సాప్ చాట్ లను పంపించడం చాలా ఇబ్బంది ఉంటుంది. దీని కారణంగా ఫోన్ వినియోగదారులు చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఈ సమస్యకు మెటా చాలా సులువైన పరిష్కారం చూపింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నుంచి ఐఫోన్ కు మారుతున్న వినియోగదారులకు ఇది శుభవార్త.

WhatsApp Chat Transfer: ఆండ్రాయిడ్ టు ఐఫోన్.. వాట్సాప్ డేటా బదిలీ ఇక చాలా ఈజీ..
Whatsapp Data Transfer From Android To Iphone
Madhu
|

Updated on: Aug 21, 2024 | 5:26 PM

Share

ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండడం నేడు సాధారణ విషయంగా మారింది. ఆ ఫోన్ లేకపోతే రోజు ముందుకు నడవని పరిస్థితి ఏర్పడింది. నిత్య జీవితంలో చేయాల్సిన ప్రతి పనికీ అవసరంగా మారింది. ఫోన్ల కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో రోజూ వివిధ బ్రాండ్ల కొత్త ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. ప్రత్యేకతలు, ఫీచర్లు, టెక్నాలజీ విషయంలో ఒకదానికి మించి ఒకటి ఉంటున్నాయి. ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒకే ఫోన్ ను ఎక్కువ కాలం ఉపయోగించడం లేదు. కొందరు అయితే ఏడాదికే మార్చేస్తూ ఉంటారు. ఇదేమీ పెద్ద సమస్య కాదు. కానీ పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ కు వాట్సాప్ చాట్ లను పంపించడం చాలా ఇబ్బంది ఉంటుంది. దీని కారణంగా ఫోన్ వినియోగదారులు చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఈ సమస్యకు మెటా చాలా సులువైన పరిష్కారం చూపింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నుంచి ఐఫోన్ కు మారుతున్న వినియోగదారులకు ఇది శుభవార్త. వాట్సాప్ చాట్ లను ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా బదిలీ చేసుకోవచ్చు.

వాట్సాప్ కు ఆదరణ..

ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ కు అత్యంత ప్రజాదరణ ఉంది. ఈ యాప్ లేని ఫోన్ ఉందంటే నమ్మలేం. నిత్యం జీవితంలో అనేక అనేక విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. కానీ ఫోన్ మార్చినప్పుడు వాట్సాప్ డేటాను మరో ఫోన్ కు బదిలీ చేసుకోవడం గతంలో ఇబ్బందిగా ఉండేది. మెటా తీసుకువచ్చిన కొత్త విధానంతో ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్ కు మారే యూజర్లకు చాలా ఉపయోగం కలుగుతుంది. చాలా సులువుగా బదిలీ చేసుకునే వీలు కలిగింది.

ఇవి అవసరం..

వాట్సాప్ నుంచి మీడియా, చాట్‌లను బదిలీ చేయాలంటే మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఆండ్రాయిడ్ ఓఎస్ 5 లేదా అంతకంటే ఎక్కువ ఇన్‌స్టాల్ చేసి ఉండాలి. అలాగే కొత్తగా తీసుకున్న ఐఫోన్ లో ఐఓఎస్ 15.5 లేదా అంతకంటే ఎక్కువ ఇన్‌స్టాల్ చేయాలి. వీటితో పాటు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి మూవ్ టు ఐఓఎస్ అప్లికేషన్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేయాలి.

సమయం పట్టే అవకాశం..

ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ కు వాట్సాప్ డేటా బదిలీ కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. మీ వాట్సాప్ లో ఉన్న బ్యాకప్ మీద సమయం ఆధారపడి ఉంటుంది. ముందుగా రెండు ఫోన్లనూ పవర్ సోర్స్‌లో ప్లగ్ చేసి ఉంచాలి. లేకపోతే స్మార్ట్‌ఫోన్‌లో కనీసం 60 శాతం బ్యాటరీ చార్జింగ్ అవసరం. మీ రెండు పరికరాలను ఒకే వైర్‌లెస్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయాలి. లేకపోతే ఐఫోన్ అనుకూల హాట్‌స్పాట్ నెట్‌వర్క్‌కి ఆండ్రాయిడ్ ఫోన్ ను కనెక్ట్ చేసుకోవచ్చు.

బదిలీ చేసుకునే విధానం..

  • ఆండ్రాయిడ్ ఫోన్‌లో మూవ్ టు ఐఓఎస్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. స్క్రీన్‌పై వచ్చే సూచనలను అనుసరించాలి.
  • కోడ్ గురించి అడిగినప్పుడు మీ ఐఫోన్ లో కనిపించిన కోడ్‌ని నమోదు చేయాలి.
  • కంటిన్యూ అండ్ ఫాలో ద ఆన్ స్క్రీన్ ఇన్ స్ట్రక్షన్స్ అనే దానిపై ట్యాబ్ చేయాలి.
  • బదిలీ డేటా స్క్రీన్‌లో వాట్సాప్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆండ్రాయిడ్ ఫోన్ లో స్టార్ట్ అనే ఆప్షన్ పై నొక్కండి. డేటా ట్రాన్స్ ఫర్ చేయడానికి వాట్సాప్ కోసం వేచి ఉండండి.
  • నెక్ట్స్ బటన్ పై నొక్కి, కంటిన్యూ పై క్లిక్ చేయాలి. బదిలీ కోసం వేచి ఉండాలి.
  • తర్వాత, మీ ఐఫోన్ లో వాట్సాప్ యాప్ ను తెరిచి, మీ రిజిస్టర్డ్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
  • అనంతరం స్టార్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, డేటా బదిలీ అయ్యే వరకూ వేచి ఉండండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..