Sensor Machine: యువరైతు వినూత్న ఆవిష్కరణ.! పంటలకు కాపలా కాసేందుకు సెన్సార్ యంత్రం..
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం తాళ్ల సింగారంకు చెందిన నరసింహ, శేషమ్మల కుమారుడు తొటకూర ప్రవీణ్ యాదవ్ చౌటుప్పల్ లోనే ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఆర్థిక స్తోమత లేక పై చదువులు చదవలేకపోయాడు. తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయాన్నే ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు. పంటలు చేతికి వచ్చే సమయంలో జంతువులు, దొంగల బారి నుంచి కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది.
యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం తాళ్ల సింగారంకు చెందిన నరసింహ, శేషమ్మల కుమారుడు తొటకూర ప్రవీణ్ యాదవ్ చౌటుప్పల్ లోనే ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. ఆర్థిక స్తోమత లేక పై చదువులు చదవలేకపోయాడు. తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయాన్నే ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు. పంటలు చేతికి వచ్చే సమయంలో జంతువులు, దొంగల బారి నుంచి కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది. అంతేకాదు వ్యవసాయపనిముట్లు, మరో వైపు వ్యవసాయానికి అనుబంధంగా గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం, ఇతర వ్యవసాయ సామాగ్రికి కాపలాగా రాత్రివేళ రైతులు ఉండాల్సి వస్తోంది. ఈ కష్టాలనుంచి రైతులను గట్టెక్కించాలనుకున్నాడు ప్రవీణ్, తన నైపుణ్యానికి పదునుపెట్టి సెన్సార్ అనే పరికరాన్ని తయారుచేశాడు. ఈ పరికరానికి రైతు భరోసా సెక్యూరిటీ గా నామకరణం చేశాడు. 12 వాట్స్ సోలార్ ప్యానెల్, 12 వాట్స్ బ్యాటరీ, సిమ్ కలిగిన సాధారణ సెల్ ఫోన్, రెండు చిన్నసైజు అద్దాలు లేజర్ సెన్సర్లు ఏర్పాటు చేయడానికి రెండురాడ్లు, సౌండ్ చేసేందుకు అలారం బాక్స్ ఉంటుంది. ఇది పూర్తిగా సోలార్ తో పనిచేస్తుంది. ఇందులో వినియోగించే సెల్ ఫోన్ కూడా ఆటోమెటిక్ గా సోలార్ తోనే చార్జింగ్ అవుతుంది. ఇందులోని సెల్ ఫోన్లలో ముందుగానే సంబంధిత వ్యక్తుల సెల్ నంబర్లు ఫీడ్ చేయాల్సి ఉంటుంది. పంటలు, పౌల్ట్రీ, మేకలు, గొర్రెల మందలకు రక్షణ కల్పించేలా ప్రవీణ్.. RBS సెన్సార్ ను రూపొందించాడు. వ్యవసాయ క్షేత్రాల వద్ద RBS సెన్సార్ పరికరాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంతాల్లోకి ఒకవేళ జంతువులు, పశువులు, దొంగలు వస్తే సెన్సర్లు పెద్దగా సౌండ్ చేయడంతో పాటు సెన్సార్ కు అనుసంధానం చేసిన ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ వెళుతుంది. దాంతో రైతులు అలర్టయ్యే అవకాశం ఉంటుంది. RBS సెన్సార్ కిలో మీటర్ దూరం వరకు పనిచేస్తుంది.
Voice : భువనగిరిలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ప్రవీణ్ ఈ పరికరాన్ని ప్రదర్శించాడు. ప్రవీణ్ ప్రయోగాన్ని మెచ్చిన అధికారులు అతనికి సర్టిఫికెట్ అందజేశారు. గతంలోనూ మ్యాజిక్ స్పేయర్, వాటర్ కంట్రోలర్స్ వంటి ఐదు రకాల పరికరాలు రూపొందించాడు. ప్రభుత్వం తనకు ఆర్థికంగా చేయూతనిస్తే రైతులకు ఉపయోగపడే మరిన్ని పరికరాలను సృష్టిస్తానని చెబుతున్నాడు. ఉన్నత చదువులు లేకుండానే రైతుల కోసం వినూత్న ఆవిష్కరణలు చేస్తున్న యువరైతు ప్రవీణ్ ను అన్నదాతలు అభినందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.