OLED vs QLED TVs: స్మార్ట్ టీవీల్లో ఓఎల్ఈడీ, క్యూఎల్ఈడీ అంటే ఏమిటి? రెండింటిలో ఏది బెస్ట్?
ఎల్‌ఈడీ టీవీల్లో ఎక్కువగా వినిపించే రెండు రకాలు క్యూఎల్‌ఈడీ(QLED), ఓఎల్‌ఈడీ(OLED). వీటిని గురించి వింటూ ఉంటాం కానీ అసలు వీటి అర్థం ఏమిటి? వాటిలోని ప్రత్యేకతలు ఏమిటి? తేడాలు ఏమిటి? అన్న విషయంలో పెద్దగా ఎవరికీ అవగాహన ఉండదు. ఒకవేళ మీరు ఓ మంచి టాప్ బ్రాండ్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే ఉద్దేశంలో ఉంటే.. తప్పనిసరిగా క్యూఎల్‌ఈడీ, ఓఎల్‌ఈడీ గురించి తెలుసుకొని ఉండాలి.

ప్రస్తుతం అంతా ఎల్‌ఈడీ టీవీల హవా నడుస్తోంది. పోర్టబుల్ టీవీలు దాదాపు కనుమరగు అయ్యాయి. స్లిమ్ డిజైన్‌లో అత్యంత ఆకర్షణీయంగా టీవీలు కనిపిస్తున్నాయి. 24 అంగుళాల నుంచి 32, 43, 55, 60, 98 అంగుళాల వరకూ వివిధ రకాల పరిమాణాల్లో టీవీలు అందుబాటులో ఉన్నాయి. డిస్ ప్లే క్వాలిటీ, ఆడియో క్లారిటీ, ఫీచర్లలోనూ చాలా రకాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఎల్‌ఈడీ టీవీల్లో ఎక్కువగా వినిపించే రెండు రకాలు క్యూఎల్‌ఈడీ(QLED), ఓఎల్‌ఈడీ(OLED). వీటిని గురించి వింటూ ఉంటాం కానీ అసలు వీటి అర్థం ఏమిటి? వాటిలోని ప్రత్యేకతలు ఏమిటి? తేడాలు ఏమిటి? అన్న విషయంలో పెద్దగా ఎవరికీ అవగాహన ఉండదు. ఒకవేళ మీరు ఓ మంచి టాప్ బ్రాండ్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే ఉద్దేశంలో ఉంటే.. తప్పనిసరిగా క్యూఎల్‌ఈడీ, ఓఎల్‌ఈడీ గురించి తెలుసుకొని ఉండాలి. అందుకే మీకోసం వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందిస్తున్నాం.
క్యూ ఎల్‌ఈడీ అంటే..
గత కొన్నేళ్లుగా మార్కెట్లో విడుదలైన హై-ఎండ్ శామ్సంగ్ టీవీలలో దేనిని చూసినా.. ఆ టీవీ చివరన క్యూఎల్‌ఈడీ లేబుల్‌ని మీకు కనిపిస్తుంది. శామ్సంగ్ చెబుతున్న దాని ప్రకారం క్యూఎల్‌ఈడీ అంటే క్వాంటం డాట్ ఎల్‌ఈడీ టీవీ. అంటే ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీల తర్వాత పరిణామక్రమంలో లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్‌గా ఈ క్యూఎల్‌ఈడీ టీవీ మార్కెట్లోకి వచ్చింది. పాత ఎల్‌ఈడీ ఎల్సీడీ టీవీలకు క్వాంటం డాట్ ఫిల్మ్‌ను ఇది జోడిస్తుంది. ఇది చిత్రం నాణ్యతను మరింతగా పెంచుతుంది. క్వాంటం అంటే మైక్రోస్కోపిక్ అణువులు. వాటిని మరొక కాంతి తాకినప్పుడు విభిన్న రంగులలో ప్రకాశమవంతమైన కాంతిని విడుదల చేస్తుంది. అదే ఈ క్యూఎల్ఈడీ టీవీలలో ఉంటుంది. ఫిల్మ్ లోని చుక్కలను ఎల్ఈడీ బ్యాక్ లైట్ నుంచి కాంతి తాకినప్పుడు అవి క్వాంటం అంటే చుక్కల ద్వారా కొత్త కాంతిని ప్రసారం చేస్తాయి.
ఓఎల్ఈడీ అంటే..
ఓఎల్ఈడీ అంటే ఆర్గానిక లైట్ ఎమిటింగ్ డయోడ్. ఇది ఎల్ఈడీ ఎల్సీడీ టీవీలకు భిన్నంగా ఉంటుంది. క్యూఎల్ఈడీలలో ఎల్ఈడీ బ్యాక్ లైట్ సిస్టమ్ ఉన్నట్లుగా ఈ ఓఎల్ఈడీలలో ఎమిటింగ్ సాంకేతికతతో వస్తాయి. ఎమిటింగ్ అంటే డిస్‌ప్లేలోని పిక్సెల్‌లు ఒక్కొక్కటి తమ సొంత కాంతిని విడుదల చేస్తాయి. ఇది వారికి వ్యక్తిగత బ్రైట్ నెస్, కాంట్రాస్ట్‌ను కలిగి ఉంటుంది. ఇది డార్క్ థీమ్ ని మరింత ప్రభావవంతంగా చూపిస్తాయి.
ఓఎల్ఈడీ లాభాలు.. నష్టాలు..
ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు మెరుగైన కాంట్రాస్ట్, బ్లాక్ స్థాయిలను అందిస్తాయి. ఇది ఒక చలనచిత్రం లేదా టెలివిజన్ షోలోని ప్రతి సన్నివేశాన్ని ఉత్తమంగా ప్రకాశింపజేసేలా చేసి అధిక నాణ్యత కలిగిన చిత్రాన్ని అందిస్తుంది. అంటే ఓఎల్ఈడీ టీవీలో అద్భుతమైన హెచ్డీఆర్ నాణ్యతను మీరు పొందొచ్చు. అయితే వ్యక్తిగత లైటింగ్‌పై ఆధారపడినందున, అవి మీ టాప్-ఆఫ్-ది-లైన్ క్యూఎల్ఈడీ డిస్‌ప్లేల కంటే కాస్త మసకగా ఉంటాయి. ఇవి తరచుగా ఎక్కువ మొత్తం ప్రకాశాన్ని కలిగి ఉంటాయి. మీ టీవీ గదులు చీకటిగా ఉండి, కిటికీలు, బ్లాక్ అవుట్ కర్టెన్లు ఉన్న గదులలో ఓఎల్ఈడీ టీవీలు బాగుంటాయి. గదిలో వెలుతురు బాగా ఉండి.. ప్రకాశవంతంగా ఉంటే అక్కడ ఈ అంత స్పష్టంగా కనిపించవు. ఓఎల్ఈడీలు 24/7 న్యూస్‌కాస్ట్‌లను రన్ చేయకపోవడం మంచిది.
క్యూఎల్ఈడీ లాభాలు, నష్టాలు..
క్యూఎల్ఈడీ టీవీలు లైటింగ్ ఎక్కువగా ఉండే గదులకు సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే 65-అంగుళాల హిసెన్స్ క్లాస్ యూ8 వంటి కొన్ని మోడల్‌లు 2,000 నిట్‌ల గరిష్ట ప్రకాశం స్థాయిలను చేరుకోగలవు. అయితే ఇదే కొన్ని సమయాల్లో ప్రతికూలతగా కూడా మారగలదు.
క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీలలో ఏది మంచిది?
అంతిమంగా, ఇది మీ టెలివిజన్‌లో మీరు ఏ రకమైన నాణ్యతను వెతుకుతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం, ఓఎల్ఈడీ డిస్ప్లేలు ప్రతి పిక్సెల్ నుంచి వచ్చే వ్యక్తిగత లైటింగ్, మెరుగైన కాంట్రాస్ట్, బ్లాక్ స్థాయిని అందిస్తాయి. క్యూఎల్ఈడీ డిస్‌ప్లేలు తరచుగా ప్రకాశవంతంగా ఉంటాయి. ప్రస్తుత ఓఎల్ఈడీ మోడల్‌ల కంటే ప్రకాశవంతంగా ఉంటాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..