New Jobs: మంచి ప్యాకేజీ ఇచ్చే ఉద్యోగం కావాలంటే ఇలా చేయండి..!
ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే అబ్బో అనే వాళ్ళు. కానీ కోవిడ్ తరువాత పరిస్థితులు మారిపోయాయి. అబ్బో అన్న వారే అబ్బే అంటున్నారు. కొందరికి అయితే లే ఆఫ్‌లు ఇచ్చి ఇంటికి సాగనంపుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక తలపట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. అలాంటి వారికి మరో సువర్ణావకాశం లభించింది. ఐటీ ఉద్యోగాన్ని పొందడం మీ కల.. ఈ కలలను సాకారం చేసుకునేందుకు సరికొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చేశాయి. అవేంటో వాటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే అబ్బో అనే వాళ్ళు. కానీ కోవిడ్ తరువాత పరిస్థితులు మారిపోయాయి. అబ్బో అన్న వారే అబ్బే అంటున్నారు. కొందరికి అయితే లే ఆఫ్‌లు ఇచ్చి ఇంటికి సాగనంపుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక తలపట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. అలాంటి వారికి మరో సువర్ణావకాశం లభించింది. ఐటీ ఉద్యోగాన్ని పొందడం మీ కల.. ఈ కలలను సాకారం చేసుకునేందుకు సరికొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చేశాయి. అవేంటో వాటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఐటి నిపుణులకు భారతదేశంలో డిమాండ్ ఉంది. ఐటీ రంగానికి సంబంధించిన డిగ్రీ లేదా డిప్లొమా కోర్సు చేస్తే మంచి ప్యాకేజీతో ఉద్యోగం పొందవచ్చు. విదేశాల్లో కూడా వారికి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఐటీ నిపుణులు సమయానుసారంగా టెక్నాలజీని అందిపుచ్చుకొని తమ నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. టెక్నాలజీ రోజురోజుకూ మారుతోంది. అటువంటి పరిస్థితిలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రాణిస్తున్న యువత తమ నైపుణ్యాలను, టెక్నాలజీని కాలమాన పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని సర్టిఫికేట్ కోర్సులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. వాటి సహాయంతో ఐటీ రంగంలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధించవచ్చు అంటున్నారు ఐటీ నిపుణులు.
1- సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్ (CISM)
ప్రస్తుతం సర్టిఫైడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్ ఉద్యోగం చాలా ట్రెండ్‌లో ఉంది. సీఐఎస్ఎం కోర్సులో సర్టిఫికేట్ పొందడం ద్వారా ఐటీ రంగంలో భద్రత నిర్వహణపై మంచి నైపుణ్యం కలిగి ఉన్నారని గుర్తింపు లభిస్తుంది. తద్వారా సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాన్ని పొందేందుకు మార్గం సులభం అవుతుంది. ఈ కోర్సులో ట్రైనింగ్ పూర్తైన ఐటి నిపుణులకు సర్టిఫికేట్ చాలా ముఖ్యం అంటున్నారు ఐటీ విశ్లేషకులు.
2- గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫారమ్ (GCP)
దీనిని సర్టిఫైడ్ ప్రొఫెషనల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్ అని కూడా అంటారు. గూగుల్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సర్చ్ ఇంజన్. దీనికి చాలా రకాలుగా ఉన్నాయి. మీరు గూగుల్ క్లౌడ్‌ని ఉపయోగించి ప్రోగ్రామింగ్లో వచ్చే సమస్యలను అధిగమించేందుకు వీలుంటుంది. అంతేకాకుండా ఇతర టెక్నాలజీకి సంబంధించిన విషయాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుందని ఈ కోర్సు తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ పొందడం వల్ల క్లౌడ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం పక్కాగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ కోర్సు చేసేందుకు యువత చాలా ఆసక్తి చూపిస్తోంది.
3- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ (PMP)
ఈ రోజుల్లో చాలా ఐటీ కంపెనీలు ప్రాజెక్టులను తీసుకొని వర్క్ చేస్తున్నాయి. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ కోర్సులో మంచి నైపుణ్యం పొందడం వల్ల ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగానికి అర్హులవుతారు. దీంతో ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు మీ టెక్నికల్ స్కిల్స్‌ను చూపించుకునే వీలు ఉంటుంది. ఈ సర్టిఫికేట్ కోర్సులో వివిధ దేశాల నుంచి తీసుకున్న ప్రాజెక్ట్‌లను ఎలా ప్లాన్ చేయాలి, హ్యాండిల్ చేయడంలో మెళుకువలు, టేకాఫ్ చేసిన వాటిని సరైన మార్గంలో పెట్టడం ఎలా అనే అంశాలపై అవగాహన కల్పిస్తారు. తద్వారా మీ సామర్థ్యంతో పాటూ మంచి ప్యాకేజీని పొందే అవకాశం ఉంటుంది. దీనికి అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపు ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








