Startup: జీవితాన్ని మార్చేసిన ఐడియా.. అస్సాం యువకుడికి రూ. 416 కోట్లు..
ఆ యువకుడు రూపొందించిన ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్‌ను అమెరికా టెక్ దిగ్గజం ‘అటోమేటిక్’ రూ.416 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంతకు ఆ యువకుడు ఎవరు, ఆ యాప్ ఏంటనే కదా మీ డౌట్.. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. చారియాలీ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త మహేంద్ర బగారియా, నమీతా బగారియా కుమారుడు కిషన్ పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఇటీవలే అతను...

ప్రస్తుతం దేశంలో స్టార్టప్ కంపెనీల హవా నడుస్తోంది. ఒక చిన్న ఐడియా వందల కోట్లను వచ్చి పడేలా చేస్తుంది. యువత అంతా ఆ క్లిక్ అయ్యే ఒక చిన్న ఐడియా కోసమే తపన పడుతున్నారు. అలాంటి ఐడియానే ఓ అస్సాం యువకుడి జీవితాన్ని మార్చేసింది. సోషల్ మీడియాలో ఎన్నో రకాల యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడుతూ ఉంటాం.. ఒక్కొక్క సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక్కో రకమైన ఉపయోగం. కానీ అన్నింటినీ ఒకే యాప్‌లో తేవడం ద్వారా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా అన్ని మెసేజ్‌లు అక్కడే కనిపించేలా అద్భుతమైన ఐడియాతో టెక్స్ట్ యాప్ క్రియేట్ చేశాడు.
ఆ యువకుడు రూపొందించిన ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్‌ను అమెరికా టెక్ దిగ్గజం ‘అటోమేటిక్’ రూ.416 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంతకు ఆ యువకుడు ఎవరు, ఆ యాప్ ఏంటనే కదా మీ డౌట్.. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. చారియాలీ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త మహేంద్ర బగారియా, నమీతా బగారియా కుమారుడు కిషన్ పైచదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఇటీవలే అతను texts.com అనే ఆల్ ఇన్ వన్ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్‌ను తయారు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, మెసెంజర్, వాట్సప్ వంటి యాప్‌లలో ఉన్న కాంటాక్ట్స్‌తో ఈ యాప్‌ను ఉపయోగించి మెసేజ్‌లు చేసుకోవచ్చు.
అయితే ఈ యాప్‌ను అమెరికా టెక్ దిగ్గజం ఆటోమేటిక్ సంస్థ కొనుగోలు చేయడంతో కిషన్ కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇతని ట్యాలెంట్‌తో టెక్ రంగంలో భారతీయులకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు. అతడు రూపొందించిన ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్‌ను అమెరికా దిగ్గజ టెక్ కంపెనీ 416 కోట్ల రూపాయిలకు కొనుగోలు చేయడం విశేషం. ఈ బిజినెస్ డీల్ తరువాత యూఎస్ నుంచి దిబ్రూగఢ్‌కు చేరుకున్న ఆ యువకుడికి.. అతడి కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ యాప్‌ను అమెరికా టెక్ దిగ్గజం ఆటోమేటిక్ సంస్థ కొనుగోలు చేయడంతో కిషన్ కోటీశ్వరుడిగా మారిపోయాడు.
అయితే చిన్న వయసులోనే అరుదైన ఘనత సాధించిన వ్యక్తిగా అసోం యువకుడిగా మారాడు.. ప్రస్తుతం అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అతని ప్రతిభను ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ఇంత ట్యాలెంట్ ఉన్న వ్యక్తి భారతీయుడు కావడం గర్వంగా ఉందని అన్నారు. ప్రస్తుతం అసోం యువకుడికి సంబంధించిన ఫొటో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుండగా, అతనిపై నెటిజన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




