- Telugu News Photo Gallery Technology photos Youtube Planning to introduce new artificial intelligence feature for videos
Youtube: యూట్యూబ్‌లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఈ ఫీచర్ ఉపయోగం ఏంటో తెలుసా?
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌ను కోట్లాది మంది ఉపయోగిస్తున్నారు. ఓటీటీల హవా ఓ రేంజ్‌లో నడుస్తున్న ఈ రోజుల్లోనూ యూట్యూబ్‌కు ఏమాత్రం ఆదరణ తగ్గకపోవడానికి ఇందులోని ఫీచర్సే కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది యూట్యూబ్..
Updated on: Nov 09, 2023 | 9:59 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడీ పేరు ప్రపంచాన్ని శాసిస్తోంది. అన్ని రంగాల్లో ఏఐ వినియోగం అనివార్యంగా మారింది. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా ఏఐ సాంకేతికత టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలు తొక్కిస్తోంది.

యూజర్ల అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ వినియోగిస్తూ టెక్ సంస్థలు సైతం కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్‌ను ప్రవేశపెట్టింది.

తమ యూజర్లకు మరింత బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే క్రమంలో యూట్యూబ్‌లో ఏఐ ఆధారిత కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్ ఏంటి.? దాంతో కలిగే ప్రయోజనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

యూట్యూబ్ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్ సహాయంతో వీడియోలకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు, కంటెంట్ కోసం సిఫార్సులు వంటి వాటికి సమాధానాలు ఇవొచ్చు. వీడియో కింద కనిపించే 'ఆస్క్' అనే ఆప్షన్ ద్వారా వీడియోకు సంబంధించి ప్రశ్నలు అడగడం లేదా ఇతర వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ ప్రశ్నలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాధానాలు ఇస్తారు. ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఎంపిక చేసిన కొందరు యూజర్లకు అందిస్తుండా, త్వరలోనే యూట్యూబ్ ప్రీమియం మెంబర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు.





























