- Telugu News Photo Gallery Technology photos Whatsapp introduces new search feature, Now users can search messages by date and month
Whatsapp: పాత మెసేజ్‌లు వెతకడం ఇక మరింత సులువు.. వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్
వాట్సాప్ మేసేజింగ్ యాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి పనిలేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు, మార్కెట్లో ఉన్న పోటీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంతటి క్రేజ్ ఉంది. ఇలా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్ ఆజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను పరిచయం చేసింది..
Updated on: Nov 09, 2023 | 9:07 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తాజాగా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. సాధారణంగా వాట్సాప్‌లో పాత మెసేజ్‌లు చూడాలంటే స్క్రోల్ చేస్తూ పైకి వెళ్లడం లేదా సెర్చ్ బాక్స్‌లో మీరు వెతకాలనుకుంటున్న మెసేజ్‌కు సంబంధించిన ఏదైనా కీ వర్డ్‌ను ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఇకపై వాట్సాప్‌లో పాత మెసేజ్‌లను మరింత సులభంగా వెతుక్కోవచ్చు. గ్రూప్స్‌లో కూడా మెసేజ్‌లను ఈ ఫీచర్‌తో సులభంగా సెర్చ్ చేసుకోవచ్చు.

వాట్సాప్ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్ సహాయంతో యూజర్లు తేదీ సహాయంతో పాత మెసేజ్‌లను వెతుక్కోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ కొత్త ఫీచర్‌లో సెర్చ్ బాక్స్ ఓపెన్ చేయగానే తేదీలతో కూడిన క్యాలెండర్ కనిపిస్తుంది. ఇందులో మీరు ఏ తేదీన మెసేజ్‌లు వెతకాలి అనుకుంటున్నారో తేదీని ఎంటర్ చేయాలి.

డేట్, నెల, సంవత్సరం ఆధారంగా మీకు కావాల్సిన మెసేజ్‌ను వెతుక్కోవచ్చు. వాయిస్ మెసేజ్‌లతో పాటు, టెక్ట్స్ మెసేజ్‌లు కూడా కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ వెబ్ వెర్షన్ బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మిగతా వారికి కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.





























