AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Jio Bharat: వాట్సాప్, యూపీఐ ఫీచర్లతో జియో 4జీ ఫోన్.. ధర కేవలం రూ. 999

రిలయన్స్ జియో నుంచి మామూలు ఫీచర్ ఫోన్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. వీటికి కూడా బాగానే డిమాండ్ ఉంటోంది. కాగా ఇటీవల దీనిని అప్ గ్రేడ్ చేసిన జియో భారత్ పేరుతో కొత్త వెర్షన్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు దీనిని మరిన్ని అదనపు ఫీచర్లను జోడించి మరోసారి లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Reliance Jio Bharat: వాట్సాప్, యూపీఐ ఫీచర్లతో జియో 4జీ ఫోన్.. ధర కేవలం రూ. 999
Jio Bharat Phone
Madhu
| Edited By: |

Updated on: Nov 09, 2023 | 9:25 PM

Share

రిలయన్స్ జియో.. మన దేశంలో ఓ సంచలనం అని చెప్పాలి. ఇంటర్ నెట్ సేవలను గ్రామీణుల చెంతకు సైతం అతి తక్కువ ధరకే చేరవేసిన దిగ్గజ కంపెనీ. చవకైన ప్లాన్లను అందిస్తూ ఇప్పటికే దేశంలో టాప్ నెట్ వర్క్ గా కొనసాగుతోంది. ఇదే రిలయన్స్ జియో నుంచి మామూలు ఫీచర్ ఫోన్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. వీటికి కూడా బాగానే డిమాండ్ ఉంటోంది. కాగా ఇటీవల దీనిని అప్ గ్రేడ్ చేసిన జియో భారత్ పేరుతో కొత్త వెర్షన్ ను లాంచ్ చేసింది. ఇప్పుడు దీనిని మరిన్ని అదనపు ఫీచర్లను జోడించి మరోసారి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ జియోఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రిలయన్స్ జియో వాట్సాప్, లైవ్ టీవీ స్ట్రీమింగ్ యూపీఐ చెల్లింపులు వంటి ఫీచర్లతో రూ. 999కే 4జీ సపోర్టుతో ఉండే జియో భారత్ ఫోన్‌లు మార్కెట్లో మంచి బాగా రాణించాయి. దీనిని మరింత అనువైనదిగా మార్చేందుకు రిలయన్స్ ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు రిలయన్స్ జియో ప్రెసిడెంట్ (పరికరాల విభాగం) సునీల్ దత్ తెలిపారు. టెలికాం దిగ్గజం నోకియా, లావా, ట్రాన్స్‌షన్స్ ఐటెల్ వంటి మొబైల్ ఫోన్ బ్రాండ్‌లతో కలిసి కొత్త స్మార్ట్‌ఫోన్ వెర్షన్‌లను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటికీ 2జీ వినియోగిస్తున్న 250 మిలియన్ల వినియోగదారులను 4జీ వైపు మళ్లించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామన్నారు. 2జీ ఫోన్ వినియోగదారు ఉపయోగించడం సౌకర్యంగా ఉండదని అన్నారు. అలా అని 4జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే ఖర్చు అవుతోందన్నారు. దీనిని భరించలేని వారు ఇప్పటికే 2జీ బేసిక్ ఫీచర్ ఫోన్లను వినియోగిస్తున్నారన్నారు. అలాంటి వారి కోసమే అతి తక్కువ ధరలో తాము 4జీ సపోర్టుతో పాటు ప్రస్తుత సమకాలిన పరిస్థితుల్లో అవసరమైన యాప్స్, ఫీచర్లతో ఈ కొత్త జియో భారత్ ను తీసుకొస్తున్నామన్నారు.ఈ ఫోన్లో 450 కంటే ఎక్కువ ఛానెల్‌లతో లైవ్ టీవీ, తాజా చిత్రాలు, వేలాది పాటలు, ఐపీఎల్ స్ట్రీమింగ్ తదితర ఫీచర్లను 30 శాతం తక్కువ ధరకు అందిస్తోందన్నారు. జియో స్కాన్ అండ్ పే ఆప్షన్‌తో యూపీఐ చెల్లింపులను ప్రవేశపెట్టిందని దత్ చెప్పారు.

నాలుగు మోడళ్లు..

జియో భారత్ ప్లాట్‌ఫారమ్‌లో నాలుగు మోడళ్లు ఉన్నాయి. గత నెలలో, రిలయన్స్ జియో కొత్త 4జీ ఫోన్, జియోభారత్ బీ1ను ప్రవేశపెట్టింది . కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 1,299 విలువైన ఫోన్ 2.4అంగుళాల స్క్రీన్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది సినిమాలు, వీడియోలు, స్పోర్ట్స్ హైలైట్‌లను ఆస్వాదించడానికి జియో యాప్‌లను ప్రీ ఇన్‌స్టాల్ చేసింది. ఫోన్ 23 భారతీయ భాషలను అప్‌పోర్ట్ చేస్తుంది. యూపీఐ చెల్లింపుల కోసం జియో పే యాప్‌ను అందిస్తుంది. జియో ప్రవేశపెట్టిన ఇతర ఫోన్‌లలో జియో ఫోన్, జియో ఫోన్ 2, జియో ఫోన్ నెక్స్ట్, జియో భారత్ వి2, కె1 కార్బన్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..