Air Coolers: హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్.. తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే..!

గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎండ నుంచి రక్షణకు చాలా మంది వివిధ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా భారతదేశంలో చాలా మంది ఎండ నుంచి రక్షణకు తక్కువ ఖర్చుతో బయటపడేలా కూలర్‌లను ఎంచుకుంటూ ఉంటారు. భారతదేశంలోని కొన్ని ప్రముఖ ఎయిర్ కూలర్ బ్రాండ్‌ల ప్రకారం, సగటు కూలర్ గంటకు 150–300 వాట్ల శక్తిని వినియోగిస్తుంది.

Air Coolers: హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్.. తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే..!
Air Coolers
Follow us

|

Updated on: Apr 25, 2024 | 3:49 PM

భారతదేశంలో ప్రస్తుతం ఎండలే హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎండ నుంచి రక్షణకు చాలా మంది వివిధ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా భారతదేశంలో చాలా మంది ఎండ నుంచి రక్షణకు తక్కువ ఖర్చుతో బయటపడేలా కూలర్‌లను ఎంచుకుంటూ ఉంటారు. భారతదేశంలోని కొన్ని ప్రముఖ ఎయిర్ కూలర్ బ్రాండ్‌ల ప్రకారం, సగటు కూలర్ గంటకు 150–300 వాట్ల శక్తిని వినియోగిస్తుంది. ఇది ఏసీతో పోల్చుకుంటే తక్కువ. అలాగే ఏసీలు ప్రస్తుతం కూలర్లతో పోలిస్తే అధిక ధరల్లో ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉండేలా ఉన్న టాప్ కూలర్లను ఓ సారి తెలుసుకుందాం. 

సింఫనీ డైట్ 12 టీ 

సింఫనీ డైట్ 12టీ పర్సనల్ టవర్ ఎయిర్ కూలర్ ఫర్ హోమ్ అత్యంత సరసమైన ధరల్లో సగటు వినియోగదారుడికి అందుబాటులో ఉంటుంది. సింఫనీ హౌస్ నుంచి ఈ అధిక-నాణ్యత ఎయిర్ కూలర్ వేడి, తేమతో కూడిన వేసవి కాలంలో కూడా మీ గది చక్కగా, చల్లగా ఉండేలా చేస్తుంది. ఇంటి కోసం సింఫనీ ఎయిర్ కూలర్ 3-సైడ్ హనీకోంబ్ ప్యాడ్‌లతో వస్తుంది. హెవీ-డ్యూటీ 170 వాట్ మోటార్‌తో నడిచే శక్తివంతమైన బ్లోవర్‌తో వస్తుంది. అంతేకాకుండా ఈ ఎయిర్ కూలర్‌కు సంబంధించిన ఐ-ప్యూర్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఈ ఎయిర్ కూలర్ ఈ ధర పరిధిలో అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా ఉంటుంది. 

క్రాంప్టన్ ఓజోన్ రాయల్ 75 టీ 

క్రాంప్టన్ ఓజోన్ రాయల్ 75 లీటర్ డెసర్ట్ ఎయిర్ కూలర్ అద్భుతమైన నిర్మాణ నాణ్యతతో ఆకర్షిస్తుంది. ఈ ఎయిర్ కూలర్ అవుటర్ పార్ట్ అధిక నాణ్యత కలిగిన ఫైబర్‌తో తయారు చేయడం వల్ల అత్యంత బలంగా ఉంటుంది. క్రాంప్టన్ నుంచి ఎడారి కూలర్ అనేది చాలా ఎక్కువ శక్తి సమర్థవంతమైన ఉత్పత్తిగా నిలుస్తుంది. 

ఇవి కూడా చదవండి

డీఎంహెచ్ 65 నియో

బజాజ్ డీఎంహెచ్ నియో 65 ఎల్ డెసర్ట్ ఎయిర్ కూలర్ సూపర్ ఫీచర్స్‌తో వస్తుంది. బజాజ్ హౌస్ నుంచి ఈ ఎయిర్ కూలర్ మీ గది మొత్తం కొన్ని సెకన్లలో చల్లగా ఉండేలా చేస్తుంది. 65 లీటర్ల వాటర్ ట్యాంక్ లోపల ఉన్న ప్యాడింగ్‌లోని ప్రతి మూలకు నీటిని పంప్ చేసేలా చేస్తుంది. తద్వారా ఈ కూలర్ నుండి వచ్చే గాలి చల్లగా, సున్నితంగా ఉంటుంది.

క్యాండిస్ 12 ఎల్

క్యాండిస్ 12 ఎల్ పోర్టబుల్ మినీ ఎయిర్ కూలర్ అతి చిన్న ఎయిర్ కూలర్‌గా ఉంది. చిన్న గది లేదా క్యాబిన్ కోసం సరైన ఎంపికగా ఉంటుంది. ఈ కూలర్ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలించడానికి చాలా సులభమైన ఉత్పత్తిగా ఉంటుంది. పోర్టబుల్, తేలికైన ఉత్పత్తి అయినప్పటికీ ఈ ఎయిర్ కూలర్ పనితీరు విషయంలో ఎలాంటి రాజీ లేదు. 

ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరా చిల్

ఓరియంట్ ఎలక్ట్రిక్ డ్యూరాచిల్ 40 ఎల్ పోర్టబుల్ ఎయిర్ కూలర్ ప్రస్తుత సీజన్‌లో సరిగ్గా సరిపోతుంది. ఈ శక్తివంతమైన ఎయిర్ కూలర్ 40 లీటర్ వాటర్ ట్యాంక్‌తో వస్తుంది. అందువల్ల ప్రతిసారి ట్యాంక్‌ను ఫుల్ చేయాలని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ కూలర్ శక్తివంతమైన మోటారు ఒక పంచ్‌ను ప్యాక్ చేస్తుంది. ప్రత్యేకమైన ఏరోఫాన్ టెక్నాలజీతో ఎయిర్ కూలర్ 40ఎల్  ట్యాంక్ కెపాసిటీ ఉన్న ఇతర ఎయిర్ కూలర్‌లతో పోలిస్తే 17 శాతం ఎక్కువ ఎయిర్ డెలివరీని అందిస్తుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..