ఇక్కడికి వెళ్తే స్వర్గాన్ని చూసినట్టే.. శీతాకాలంలో తప్పక చూడాల్సిన టాప్ 5 పర్యాటక ప్రదేశాలు
Best winter destinations India: భారతదేశం వైవిధ్యాలకు నిలయం. ఇక్కడ ఒకవైపు మంచుతో నిండిన పర్వతాలు, మరోవైపు వెచ్చని సముద్ర తీరాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. వేసవి తాపం తగ్గి, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొన్న ఈ శీతాకాలంలో, మీ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి వెళ్లదగ్గ టాప్ 5 పర్యాటక ప్రాంతాలు ఏవో చూద్దాం పదండి.
Updated on: Dec 17, 2025 | 1:30 PM

మంచు అందాల గుల్మార్గ్, కాశ్మీర్: శీతాకాలాన్ని నిజంగా ఆస్వాదించాలంటే కాశ్మీర్‌ను మించిన చోటు లేదు. ముఖ్యంగా గుల్మార్గ్ ఈ సమయంలో తెల్లని మంచు దుప్పటిని కప్పుకుని పర్యాటకులకు సాదర స్వాగతం పలుకుతుంది. స్కీయింగ్, స్నోబోర్డింగ్, ప్రపంచంలోనే ఎత్తైన కేబుల్ కార్ ప్రయాణం (గోండోలా రైడ్) వంటి ప్రత్యేకతలు ఈ ప్రాంతాన్ని మరింత టూరిజం హబ్ గా మార్చుతున్నాయి. గడ్డకట్టిన దాల్ సరస్సుపై షికార్ ప్రయాణం అన్నింటికంటే హైలెట్‌గా నిలుస్తుంది.

రాజసం ఉట్టిపడే జైపూర్ అండ్ జైసల్మేర్: ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌ను సందర్శించడానికి శీతాకాలమే సరైన సమయం. జైపూర్‌లోని కోటలు, జైసల్మేర్‌లోని ఇసుక తిన్నెలు పర్యాటకులకు అద్భుత అనుభూతిని ఇస్తాయి. ఒంటె సవారీ, ఎడారిలో క్యాంపింగ్, జానపద నృత్యాలు ఇక్కడి ప్రత్యేకతలు. రాత్రిపూట నక్షత్రాల కింద ఎడారిలో బస చేయడం ఓ హైలెట్ అనుభూతి అనే చెప్పవచ్చు.

ఆధ్యాత్మిక, సాహసాల రిషికేశ్: గంగా నది ఒడ్డున ఉన్న రిషికేశ్ ఆధ్యాత్మికతకు మాత్రమే కాదు, అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు కూడా పెట్టింది పేరు. డిసెంబర్ నెలలో ఇక్కడి వాతావరణం చాలా చల్లగా, ప్రశాంతంగా ఉంటుంది. రివర్ రాఫ్టింగ్, బంజీ జంపింగ్, యోగా కేంద్రాలు ఆకట్టుకుంటాయి. సాయంత్రం వేళ జరిగే గంగా హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

కేరళ బ్యాక్‌వాటర్స్ (మున్నార్ అండ్ అలప్పుజ): చలికాలంలో కొంచెం వెచ్చదనాన్ని కోరుకునే వారికి కేరళ ఉత్తమ ఎంపిక. మున్నార్‌లోని టీ తోటలు, అలప్పుజలోని హౌస్‌బోట్ ప్రయాణాలు మనసుకు ఎంతో హాయినిస్తాయి. ఆయుర్వేద మసాజ్‌లు, పచ్చని ప్రకృతి ఆకట్టకుంటాయి. హౌస్‌బోట్‌లో రాత్రి బస చేస్తూ కేరళ రుచులను ఆస్వాదించడం అందమైన అనుభూతిగా నిలుస్తుంది

గోవా బీచ్‌లు: డిసెంబర్ వచ్చిందంటే చాలు అందరి చూపు గోవా వైపు ఉంటుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలతో గోవా కళకళలాడుతుంది. సముద్రపు ఆహారం, వాటర్ స్పోర్ట్స్, నైట్ పార్టీలు స్పెషల్ అట్రాక్షన్. గోవాలోని పురాతన చర్చిలు మరియు సన్ సెట్ పాయింట్లు టూరిజంను మరింత స్పెషల్ చేస్తాయి.

మరి ఈ ప్రాంతాలకు వెళ్లాలనుకు పర్యాటక ప్రేమికులు ముందస్తు బుకింగ్ తప్పని చేరి చేసుకుంటే ఇబ్బందులు ఉండవు. శీతాకాలం పీక్ సీజన్ కాబట్టి హోటల్స్, టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవడం శ్రేయస్కరం. నార్త్ ఇండియా విజిట్ కి వెళ్తుంటే తప్పనిసరిగా థర్మల్ వేర్, జాకెట్లు వెంట ఉంచుకోవాలి. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా అవసరమైన మందులు వెంట ఉంచుకోవడం మంచిది.




