- Telugu News Photo Gallery Technology photos Whatsapp introducing new features that can share files without internet
Whatsapp: ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్‌లో షేరింగ్.. ఎలా పనిచేస్తుందంటే..
రోజురోజుకీ యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న యాప్స్‌లో మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్న వాట్సాప్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఫీచర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Apr 25, 2024 | 10:13 AM

మెసేజింగ్ యాప్‌గా మొదలైన వాట్సాప్ ప్రస్తుతం అన్ని రకాల సేవలను అందిస్తోంది. ఇప్పటికే ఏఐ ఆధారిత సేవలతో పాటు, యూపీఐ సేవలను సైతం అందిస్తోంది. ఇక తాజాగా మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను షేర్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అయితే రెండు ఫోన్‌లు పక్కపక్కనే ఉండాల్సి ఉంటుంది.


ఫొటోలు, డాక్యుమెంట్స్‌ను ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కు షేర్ చేసుకోవడానికి ఇకపై ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ ద్వారా పంపించుకోవచ్చన్నమాట. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే యాక్సెస్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను బీటా యూజర్లు పరీక్షిస్తున్నారు. త్వరలోనే యూజరలందరికీ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. దీంతో పాటు చాట్ ఫిల్టర్ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది.




