Itel S24: రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌ మార్కెట్‌లో భారీ పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీలు తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. తక్కువ ధర అని ఫీచర్ల విషయంలో అస్సలు కాంప్రమైజ్‌ కావడం లేదు. అధునాథన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను అత్యంత తక్కువ ధరకు తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ఐటెల్‌ కంపెనీ...

Narender Vaitla

|

Updated on: Apr 25, 2024 | 8:25 AM

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఐటెల్‌ భారత మార్కెట్లోకి కళ్లు చెదిరే ఫీచర్లతో, అత్యంత తక్కు బడ్జెట్‌లో మంచి స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఐటెల్ ఎస్‌24 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. ఐటెల్‌ ఎస్‌24 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఐటెల్‌ ఎస్‌24 స్మార్ట్ ఫోన్‌ ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.9,999గా ఉంది. అమెజాన్‌లో అమ్మకానికి ఉన్న ఈ ఫోన్ను కొనుగోలు చేస్తే రూ. 9999 విలువగల ఐటెల్‌ 42 స్మార్ట్‌ వాచ్‌ను ఉచితం సొంతం చేసుకోవచ్చు.

2 / 5
ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. 720x1,612 పిక్సెల్‌ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. అలాగే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత ఐటెల్‌ ఓఎస్‌ 13పై పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్‌ హీలియో జీ91 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు.

3 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో రౌండ్‌ షేప్‌లో అందించారు.

4 / 5
ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 18 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. అలాగే సెక్యూరిటీ కోసం ఇందులో సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ను అందించారు.

5 / 5
Follow us