AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV : అతను చేసిన పనికి కొడదామనుకున్నా.. షాకింగ్ విషయం చెప్పిన ఆర్జీవీ

సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ చేసే కామెంట్స్ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. దర్శకుడిగా ఒక వెలుగు వెలిగిన ఆర్జీవీ.. ఇప్పుడు అంతగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నారు. ఆయన ఏం చేసినా అది ఓ పెద్ద వార్తే అవుతుంది. వివాదం లేకుండా వర్మ ఉండలేరు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

RGV : అతను చేసిన పనికి కొడదామనుకున్నా.. షాకింగ్ విషయం చెప్పిన ఆర్జీవీ
Rgv
Rajeev Rayala
|

Updated on: Jan 30, 2026 | 11:39 AM

Share

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఓ హాట్ టాపిక్. ఒకప్పుడు కల్ట్ క్లాసిక్ సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు సినిమాలకు బ్రేక్ తీసుకున్నారు.. మధ్యలో మధ్యలో రూటు మార్చి బోల్డ్ సినిమాలు, బయోపిక్స్ తెరకెక్కించారు. ఇక ఇప్పుడు వింటేజ్ రామ్ గోపాల్ వర్మ రావాలని.. అప్పట్లా క్లాసిక్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆర్జీవీ కూడా అదిరిపోయే సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ రంగీలా సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు అలాగే ఆర్జీవీ పై కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

అన్నం బదులు అందం తింటుందా..!! సీరియల్‌లో సైడ్ యాక్టర్.. కానీ సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు..

రెహమాన్ సంగీతంపై వర్మ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రంగీలాలోని హై రామా, తన్హా తన్హా వంటి పాటల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 48 ఫ్రేములలో షూట్ చేసి, లిప్ సింక్‌ను సాధారణంగా ఉంచి, స్లో మోషన్ ఎఫెక్ట్‌ను తీసుకురావడం ఆ సినిమాలో మొదటిసారి జరిగిందని, ఈ టెక్నిక్ ఇప్పుడు చాలా సినిమాల్లో వాడుతున్నారని అన్నారు ఆర్జీవీ. ఇక హై రామా పాట కంపోజింగ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర సంఘటనను వర్మ వివరించారు. ఈ పాట కోసం రెహమాన్‌కు మిస్టర్ ఇండియాలోని ఓ పాటను రెఫరెన్స్‌గా ఇచ్చారట.. రెహమాన్ ఆలస్యం చేసే స్వభావం గురించి మాట్లాడుతూ.. ఎప్పుడూ సాంగ్స్ లేటుగానే ఇస్తాడు.. ఎంత లెట్ అంటే కొట్టెయ్యాలి అనేంత విసుగు వచ్చేలా చేస్తాడు. ఆ పాట కంపోజింగ్ కోసం గోవాకు తీసుకెళ్లినప్పుడు ఐదు రోజులు ఒకే రిసార్ట్‌లో, వేర్వేరు కాటేజ్‌లలో ఉన్నామని చెప్పారు. రెహమాన్ ఆ ఐదు రోజులు కేవలం టీవీ చూస్తూ గడిపాడని, ఐదు రోజులు టీవీ చూశాను అని రెహమాన్ చెప్పగానే లేచి కొడదామనుకున్నా అని ఆర్జీవీ అన్నారు. ఆతర్వాత తాను చెన్నై వెళ్లి కంపోజ్ చేసి పంపిస్తానని చెప్పాడని వర్మ తెలిపారు.

గోడకేసి కొట్టి, కటింగ్ ప్లేయర్‌తో మంగళసూత్రం తెంచాడు.. సింగర్ కౌసల్య జీవితంలో ఇంత విషాదమా..

ఆ తర్వాత రెహమాన్ పంపిన బేర్ రిథమ్ విన్నప్పుడు, అది తన ఊహకు మించి ఉందని, ఏంట్రా వీడికి పిచ్చి ఎక్కిందా అనిపించిందని వర్మ అన్నారు. తాను అడిగిన సిట్యువేషన్‌కు సంబంధం లేదని అనిపించిందని, ఫోన్ చేసి రెహమాన్‌ను ప్రశ్నించినప్పుడు, అది ఆర్కెస్ట్రేషన్‌లో బాగుంటుందని రెహమాన్ చెప్పాడని.. రెండు, మూడు రోజుల తర్వాత చెన్నై వెళ్లి, పూర్తి ఆర్కెస్ట్రేషన్ విన్నప్పుడు తన మైండ్ బ్లాంక్ అయిపోయిందని, అంత గొప్ప పాట దాని నుండి వస్తుందని కలలో కూడా ఊహించలేదని వర్మ అన్నారు. హరిహరన్, స్వర్ణలత గాత్రాలతో, రెహమాన్ ట్యూన్‌తో ఈ పాట ఇండియాన్  సినిమాల్లో అప్పటివరకు ఎప్పుడూ రాని కొత్తదనాన్ని తీసుకువచ్చిందని వర్మ అన్నారు.

ఇవి కూడా చదవండి

చూడటానికి పెద్ద అంకుల్.. కానీ నాతో అలా చేశాడు.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..