AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : సంజూను ఆటపట్టించిన కెప్టెన్ సూర్య.. డోంట్ డిస్టర్బ్ చెట్టా అంటూ నవ్వులు

Viral Video : టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా కేరళలోని తిరువనంతపురంలో అడుగుపెట్టిన భారత జట్టు సభ్యుల మధ్య ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video : సంజూను ఆటపట్టించిన కెప్టెన్ సూర్య.. డోంట్ డిస్టర్బ్ చెట్టా అంటూ నవ్వులు
Sanju Samson Surya Kumar Yadav
Rakesh
|

Updated on: Jan 30, 2026 | 10:59 AM

Share

Viral Video : టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ల మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా కేరళలోని తిరువనంతపురంలో అడుగుపెట్టిన భారత జట్టు సభ్యుల మధ్య ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ ఆడేందుకు భారత జట్టు కేరళ రాజధాని తిరువనంతపురానికి చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి జట్టు బయటకు వస్తున్న సమయంలో స్థానిక అభిమానులు తమ అభిమాన ఆటగాడు సంజూ శాంసన్ పేరును గట్టిగా నినదిస్తూ హోరెత్తించారు. ఈ క్రమంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో సంజూను ఆటపట్టించారు. మీడియా కెమెరాలు, అభిమానుల మధ్య నడుస్తున్న సమయంలో సంజూకు దారి ఇవ్వాలంటూ సూర్య సరదాగా మలయాళంలో.. “ప్లీజ్ గివ్ వే, డోంట్ డిస్టర్బ్ చెట్టా” అని కామెంట్ చేశాడు. ఈ మాట విన్న వెంటనే సంజూ శాంసన్ పెద్దగా నవ్వేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే ఈ సరదా క్షణాల వెనుక సంజూ ఫామ్ గురించి ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో సంజూ ప్రదర్శన అంత ఆశాజనకంగా లేదు. ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం 40 పరుగులు మాత్రమే చేసి తీవ్ర నిరాశపరిచారు. వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో సంజూ స్థానం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవైపు ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం, మరోవైపు తిలక్ వర్మ గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చే అవకాశం ఉండటంతో సంజూకి ఇది చావో రేవో లాంటి పరిస్థితి.

ఇదే విషయంపై మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ స్పందిస్తూ.. ఆఖరి టీ20లో సంజూ స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఆడించాలని అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్‌లో మెయిన్ వికెట్ కీపర్‌గా ఇషాన్ ఉండాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తే, అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని పార్థివ్ సూచించారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన ఇషాన్, ఈ సిరీస్‌లో కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం జరగబోయే ఆఖరి మ్యాచ్‌లో సంజూ తన సొంత గడ్డపై చెలరేగి ఆడితేనే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..