జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ముద్దు ముద్దు మాటలతో, అందంతో ఆకట్టుకుంది రష్మీ.
గత కొన్నేళ్లుగా తన యాంకరింగ్‌తో తెలుగు ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోందీ అందాల తార. అలాగే అడపా దడపా సినిమాల్లోనూ నటిస్తోందీ అందాల తార.
జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టాప్ టీవీ షోల్లోనూ సందడి చేస్తోన్న రష్మీ ప్రస్తుతం ఓ తెలుగు సినిమాలో మెయిన్ లీడ్ పోషిస్తోంది.
ఆమె నటిస్తోన్న లేటెస్ట్ తెలుగు సినిమా వైతరణి. అఖిల్ బాబు దర్శకత్వంలో ఎ.ఆర్.కాంతలక్ష్మి, ఆర్.రమేష్ బాబు వైతరణి సినిమాను నిర్మిస్తున్నారు.
ఇందులో యాంకర్ రష్మితో పాటు ప్రదీప్ పల్లి లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ప్రస్తుతం టీవీ షోస్, సినిమా షూటింగులతో బిజీగా ఉంటుంది యాంకర్ రష్మీ.
రష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సమాజంలో జరిగే విషయాల పై తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటుంది రష్మీ.
అలాగ రష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.