AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goods Train Derails: ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. పలు రైళ్లు ఆలస్యం

Goods Train Derails: ఈ మధ్య కాలంలో రైళ్లు పట్టాలు తప్పడం, ఒకదానికొకటి ఢీకొనడం లాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా ఏపీలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ కారణంగా పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో..

Goods Train Derails: ఏపీలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు.. పలు రైళ్లు ఆలస్యం
Goods Train Derails
Subhash Goud
|

Updated on: Jan 30, 2026 | 10:03 AM

Share

Goods Train Derails: ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. ఎక్కువగా రైలు పట్టాలు తప్పడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఓ గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. నాలులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపడుతున్నారు. ఈ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

గూడ్స్ రైలులోని వ్యాగన్లు పక్కనే ఉన్న రెండు రైల్వే ట్రాక్‌లపై పడిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు, సాంకేతిక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరమ్మతు పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టారు.

గూడ్స్ బోగీలు పట్టాలు తప్పడంతో.. విజయవాడ – చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదం కారణంగా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు వివిధ స్టేషన్లలో నిలిచిపోయాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి