Viral Video: ఇదేందిది నేనేడా చూడాలే.! కారుకే సంకెళ్లు వేశాడు.. ఎందుకో తెలిస్తే షాక్..!
మధ్యప్రదేశ్‌తో జరిగిన ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా హాట్ టాపిక్‌గా మారింది. జబల్‌పూర్‌లోని లార్డ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అసలు విషయానికి వస్తే, అక్కడ ఒక నాలుగు చక్రాల వాహనాన్ని నేరస్థుడిలా చేతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మధ్యప్రదేశ్‌తో జరిగిన ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా హాట్ టాపిక్‌గా మారింది. జబల్‌పూర్‌లోని లార్డ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అసలు విషయానికి వస్తే, అక్కడ ఒక నాలుగు చక్రాల వాహనాన్ని నేరస్థుడిలా చేతులకు బేడీలు వేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు CCTV కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జబల్‌పూర్‌లోని లార్డ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పార్క్ చేసిన తెల్లటి ఎర్టిగా కారు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా, ప్రమాదకరమైన నేరస్థులకు సంకెళ్లు వేస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. కారు డోరుకు ఇనుప సంకెళ్లు వేసి, కారును పోలీసుల అదుపులో ఉంచారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే సందర్శకులు కారు చూసి షాక్ అవుతున్నారు. కారు సైతం తీవ్రమైన నేరం చేసినట్లు భావిస్తున్నారు.
కారు డోరుకు సంకెళ్లు వేసిన చిత్రం సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే, అది వేగంగా వైరల్ అయింది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పుడు వాహనాలు నేరాలకు పాల్పడుతున్నాయని కొందరు జోక్ చేస్తున్నారు. మరికొందరు దీనిని పోలీసుల అణిచివేతకు ఇది ఒక ప్రత్యేకమైన మార్గం అని భావిస్తున్నారు.
పోలీసుల వివరణ – అసలు కారణం..!
కొత్వాలి CSP రితేష్ శివ్ ఒక ప్రకటన విడుదల చేయడంతో ఈ కారు సంకెళ్ల వ్యవహారం చుట్టూ ఉన్న రహస్యం తొలగిపోయింది. కారు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడని కొత్వాలి CSP రితేష్ శివ్ స్పష్టం చేశారు. పోలీసులు చట్టం ప్రకారం చర్య తీసుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే, కారుకు సంకెళ్లు వేయాలనే నిర్ణయం ఏ చట్టంలోనూ భాగం కాదు. పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న క్లర్క్ వాహనాన్ని సురక్షితంగా లాక్ చేయడానికి గొలుసుకు బదులుగా చేతి సంకెళ్లు ఉపయోగించారని CSP పేర్కొన్నారు. పోలీస్ శాఖ దీనిని విధానపరమైన లోపంగా పరిగణించి సంబంధిత క్లర్క్ నుండి వివరణ కోరింది. క్లర్క్ వైపు నుండి వచ్చిన చిన్న సౌలభ్యం వల్ల ఇది జరిగి ఉండవచ్చు, అయితే ఈ చిత్రం మధ్యప్రదేశ్ పోలీసుల “వింత” పనితీరును మరోసారి బహిర్గతం చేసింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
