AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2026: ఈ బడ్జెట్‌లో బంగారం కొనుగోళ్ల మీద పాన్-ఆధార్ పరిమితి పెంచనుందా?

Budget 2026: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139A, రూల్ 114B ప్రకారం ఒక వ్యక్తి రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారం లేదా ఆభరణాలను కొనుగోలు చేస్తే వారు తమ పాన్ నంబర్‌ను ఆభరణాల వ్యాపారికి అందించాలి. పాన్ అందుబాటులో..

Budget 2026: ఈ బడ్జెట్‌లో బంగారం కొనుగోళ్ల మీద పాన్-ఆధార్ పరిమితి పెంచనుందా?
Gold Jewellery
Subhash Goud
|

Updated on: Jan 30, 2026 | 9:42 AM

Share

Budget 2026: ప్రస్తుతం భారతదేశంలో రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారం లేదా బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి పాన్-ఆధార్‌ వివరాలను అందించడం తప్పనిసరి. ఇది ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ (Section 139A & Rule 114B) కిందకి వస్తుంది. ప్రభుత్వం 2016 సంవత్సరంలో ఈ నియమాన్ని అమలు చేసింది. ఆ సమయంలో దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 25,000, రూ.32,000 మధ్య ఉండేది. ఆ సమయంలో రూ. 2 లక్షల విలువైన బంగారం కొనుగోలు చేయడానికి ఈ నియమం సముచితంగా అనిపించింది. కానీ ఇప్పుడు 2026 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,60,000 కంటే ఎక్కువగా ఉంది. బంగారం ధర పెరిగినందున బడ్జెట్‌లో ఈ పరిమితిని పెంచాలనే డిమాండ్ ఆభరణాల పరిశ్రమ వర్గాల్లో ఉంది. బంగారం కొనుగోలు కోసం పాన్ లేదా ఆధార్ అందించడానికి ప్రస్తుతం ఉన్న రూ. 2 లక్షల పరిమితిని పెంచాలని ఆభరణాల వ్యాపారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పుడు నియమాలు ఏమిటి?

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139A, రూల్ 114B ప్రకారం ఒక వ్యక్తి రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారం లేదా ఆభరణాలను కొనుగోలు చేస్తే వారు తమ పాన్ నంబర్‌ను ఆభరణాల వ్యాపారికి అందించాలి. పాన్ అందుబాటులో లేకపోతే ఆధార్ నంబర్‌ను అందించవచ్చు. ఈ నియమం జనవరి 1, 2016 నుండి అమలులో ఉంది. 2016లో రూల్ 114Bని సవరించారు. అదే సమయంలో బంగారం, ఆభరణాలకు ప్రత్యేక పరిమితులు తొలగించారు. రూ.2 లక్షల సాధారణ పరిమితిని అమలు చేశారు. అప్పటి నుండి బంగారం ధరలు పెరిగాయి. కానీ పరిమితి మారలేదు. నల్లధనం, పన్ను ఎగవేతను నిరోధించడానికి, అధిక విలువ గల లావాదేవీల రికార్డును నిర్వహించడానికి ప్రభుత్వం ఈ వ్యవస్థను సృష్టించింది. దీని ప్రాథమిక లక్ష్యం పన్ను ఎగవేతను నిరోధించడం.

Gold Price Today: రూ.2 లక్షలకు చేరువలో బంగారం ధర.. వెండి ఎంతో తెలుసా..?

ఇప్పుడు ఆ సమస్య ఎందుకు వచ్చింది?

2016లో భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.25,000 నుండి రూ.32,000 వరకు ఉండేది. ఆ సమయంలో రూ.2 లక్షల విలువైన బంగారం కొనుగోళ్లకు పాన్ కార్డ్ నంబర్ అందించాల్సిన అవసరం సముచితంగా అనిపించింది. ఇప్పుడు గత 8–9 సంవత్సరాలుగా బంగారం ధర విపరీతంగా పెరిగింది. నేడు బంగారం ధర రూ.2 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,65,000పైగానే ఉంది. ఆభరణాల విషయానికొస్తే, వివాహాలు, పండుగల సమయంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం సాంప్రదాయంగా ఉంది. అటువంటి సందర్భంలో తయారీ ఛార్జీలతో సహా 10 గ్రాముల బంగారం కొనుగోలుకు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. అందువల్ల రూ.2 లక్షలకు పాన్ కార్డ్ అందించడం అసమంజసంగా అనిపిస్తుంది. ఆభరణాల పరిశ్రమ, సంఘాలు ఇప్పుడు ఈ పరిమితిని పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిమితి రూ.5 లక్షల వరకు పెంచాలని డిమాండ్‌ ఉంది.

ఇది కూడా చదవండి: February New Rules: వినియోగదారులకు అలర్ట్‌.. ఫిబ్రవరి 1 నుంచి మారనున్న మార్పులు ఇవే!

ఇలా చేయడం వల్ల మధ్యతరగతి కుటుంబాలకు ఊరట లభిస్తుంది. PAN భయం లేకుండా నగలు కొనవచ్చు. జ్యువెలర్లకు రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు తక్కువ పేపర్ వర్క్, సమయం ఆదా అవుతుంది. అంతేకాదు, ప్రభుత్వం నిజంగా భారీ మొత్తాల్లో ట్రాన్సాక్షన్లు చేసేవారిని మాత్రమే ట్రాక్ చేయగలదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరిన్నిబిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి