Google chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. డేటా చోరీ జరుగుతోందంటూ కేంద్రం హెచ్చరిక.. ఇలా చేస్తే సేఫ్..
మనం ఎంటర్ చేసిన పాస్ వర్డ్ లు వేరొకరి తెలిసే అవకాశం ఉంటుందా అని సందేహాలు కలుగుతాయి. గతంలో ఆ విషయంలో అనుమానాలు లేనప్పటికీ తాజాగా కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) క్రోమ్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. క్రోమ్ లోని కొన్ని లోపాల కారణంగా మన వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని తెలిపింది.

సాధారణంగా మనం అందరం గూగుల్ క్రోమ్ అనే వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి ఇంటర్నెట్ లో వివిధ పనులు చేసుకుంటాం. బ్యాంకింగ్, టికెట్ల బుకింగ్ తదితర వాటికోసం వ్యక్తిగత పాస్ వర్డ్ లను ఎంటర్ చేస్తాం. దీని ద్వారా పనులు చాలా వేగంగా జరుగుతాయి. అయితే మనం ఎంటర్ చేసిన పాస్ వర్డ్ లు వేరొకరి తెలిసే అవకాశం ఉంటుందా అని సందేహాలు కలుగుతాయి. గతంలో ఆ విషయంలో అనుమానాలు లేనప్పటికీ తాజాగా కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) క్రోమ్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. క్రోమ్ లోని కొన్ని లోపాల కారణంగా మన వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని తెలిపింది.
డేటా చోరీకి అవకాశం..
CERT-In (సెర్ట్ ఇన్) తెలిపిన వివరాల ప్రకారం గూగుల్ క్రోమ్ వినియోగదారులు హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. వెంటనే కొత్త వెర్షన్ ను అప్ డేట్ చేసుకోకుంటే వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతుందని హెచ్చరిక జారీ చేసింది. వినియోగదారులు తమ బ్రౌజర్‌లను అప్‌డేట్ చేయాలని, సిస్టమ్‌ను రక్షించుకోవడానికి భద్రతా మార్గదర్శకాలను అనుసరించాలని కోరింది.
అప్ డేట్ చాలా అవసరం..
గూగుల్ క్రోమ్ డెస్క్ టాప్ వెర్షన్ ను ఉపయోగించే వినియోగదారులకు హై రిస్క్ ఉందని సెర్ట్ ఇన్ చెబుతోంది. దానిలోని కొన్ని లోపాలను ఆసరా చేసుకుని హ్యాకర్లు రిమోట్ దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. కాబట్టి వినియోగదారులు తమ బ్రౌజర్‌లను వెంటనే అప్‌డేట్ చేయాలని కోరింది. విండోస్, మ్యాక్ గూగుల్ క్రోమ్ వెర్షన్లలో కొన్ని లోపాలు ఉన్నట్టు గుర్తించింది. హ్యాకర్ రిమోట్ తో మీ సిస్టమ్‌ను నియంత్రించడానికి లేదా క్రాష్ చేయడానికి అవకాశం ఉందని తెలిపింది.
నష్టాలు ఏమిటి..
గూగుల్ క్రోమ్ లోని కొన్ని లోపాలను ఉపయోగించుకుని హ్యాకర్ మీ కంప్యూటర్‌ను పూర్తిగా నియంత్రణ చేసే అవకాశం ఉంది. దాని ద్వారా మీ డేటాను దొంగిలించడానికి, మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి, మీ సిస్టమ్‌ను పాడు చేయడానికి వీలుంటుంది. విండోస్, మ్యాక్ లకు సంబంధించి 124.0.6367.60కి ముందు ఉన్న గూగుల్ క్రోమ్ వెర్షన్ ఇలాంటి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.
సురక్షితంగా ఉండాలంటే..
ముందుగా గూగుల్ క్రోమ్ ను తాజా వెర్షన్‌కు (124.0.6367.60 లేదా తర్వాతి) అప్‌డేట్ చేయడం అత్యంత అవకాశం. దీనిపై గూగుల్ ఇప్పటికే పరిష్కారాన్ని చూపించింది. ఈ దశలను అనుసరించడం ద్వారా క్రోమ్ ను అప్ డేట్ చేసుకోవచ్చు.
- ముందుగా క్రోమ్ ను ఓపెన్ చేయాలి.
- విండో కుడి ఎగువ మూలలో ఉన్న మూడు నిలువు చుక్కలపై క్లిక్ చేయాలి.
- సెట్టింగ్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అబౌట్ క్రోమ్ పై క్లిక్ చేయండి.
- క్రోమ్ స్వయంగా అప్ డేట్ లను తనిఖీ చేస్తుంది. అందుబాటులో ఉంటే వెంటనే డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తుంది.
జాగ్రత్తలు అవసరం..
- హ్యాకర్ల బారిన పడకుండా ఉండటానికి యూజర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అన్ ట్రస్ట్ డ్ వెబ్‌సైట్‌లను సందర్శించకూడదు. ఈ వెబ్‌సైట్‌లు మీ బ్రౌజర్‌లోని లోపాలను ఉపయోగించుకుని డేటాను చోరీ చేస్తాయి.
- అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకూడదు. ఇలాంటి ఫిషింగ్ ఇమెయిల్, మెసేజ్ లు హానికరమైన వెబ్‌సైట్‌లకు దారితీసే లింక్‌లను కలిగి ఉంటాయి.
- పాప్ అప్ బ్లాకర్‌ని ప్రారంభించండి. ఇది మీ బ్రౌజర్‌లో హానికరమైన వెబ్‌సైట్‌లను నిరోధించటానికి సహాయ పడుతుంది.
- క్యాచీ, బ్రౌజింగ్ డేటాను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. పాస్‌వర్డ్‌లను ప్రత్యేకంగా రూపొందించుకోవాలి.
- ఫైర్‌వాల్, యాంటీ వైరస్ రక్షణతో కూడిన సెక్యూరిటీ సూట్‌ని ఉపయోగించండి. మాల్వేర్ తదితర వాటిని మీ కంప్యూటర్‌కు సోకకుండా కాపాడుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




