AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meta AI: మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.

ప్రస్తుతం చాట్‌జీపీటీతో పాటు గూగుల్‌ బాట్‌ వంటివి ఏఐ రంగంలో శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే మెటా కూడా దూకుడుపెంచింది. మెటాకు చెందిన అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఏఐ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్‌పై ఏఐ టూల్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త ఏఐ టూల్...

Meta AI: మీ ఊహకు దృశ్యరూపం.. వాట్సాప్‌ ఏఐతో ఇది సాధ్యం.
Whatsapp Ai
Narender Vaitla
|

Updated on: Apr 25, 2024 | 11:37 AM

Share

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం యావత్‌ ప్రపంచాన్ని మార్చేస్తోంది. షాపింగ్‌ మొదలు వైద్యం వరకు అన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ వినియోగం అనివార్యంగా మారింది. దాదాపు అన్న ప్రధాన టెక్‌ సంస్థలు ఇప్పటికే ఈ రంగంలోకి అడుగుపెట్టాయి. గూగుల్‌, యాపిల్ వంటి సంస్థలు ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.

ప్రస్తుతం చాట్‌జీపీటీతో పాటు గూగుల్‌ బాట్‌ వంటివి ఏఐ రంగంలో శరవేగంగా దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే మెటా కూడా దూకుడుపెంచింది. మెటాకు చెందిన అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఏఐ టూల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్‌పై ఏఐ టూల్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కొత్త ఏఐ టూల్ యూజర్లకు మరిచిపోలేని అనుభూతిని అందిస్తోంది. ఫ్రెండ్లీ యూజర్‌ ఇంటర్‌ ఫేజ్‌తో ఇట్టే సమాచారం అందిస్తోంది.

ప్రస్తుతం చాట్‌ జీపీటీలో అందుబాటులో ఉన్న అన్ని రకాల ఫీచర్లను వాట్సాప్‌ ఏఐలోనూ అందిస్తున్నారు. ఏఐలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫొటో డిజైన్‌ ఫీచర్‌ సహాయంతో. మీ ఊహకు అనుగుణంగా ఏదైనా టెక్ట్స్‌ ఇస్తే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ దానంతఅదే ఫొటో మార్చేస్తుంది. ఇదే ఫీచర్‌ వాట్సాప్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇతర ఏఐ ప్లాట్‌ఫామ్స్‌లో అయితే ప్రత్యేకంగా సదరు సైట్స్‌ ఓపెన్‌ చేయాలి. అయితే వాట్సాప్‌ ఇప్పుడు ఇన్‌బిల్ట్‌గా ఈ ఫీచర్‌ను అందిస్తోంది. దీంతో యూజర్లు తమకు నచ్చిన ఫొటోలను తామే డిజైన్‌ చేసుకొని అవతలి వ్యక్తులకు క్షణాల్లో పంపించుకోవచ్చు.

Mi

ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా యూజర్లు తమ వాట్సాప్‌ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. వెంటనే మీకు చాట్‌ కోసం ఉపయోగించే ‘+’ బటన్‌పై ఒక రౌండ్ షేప్‌లో ఉన్న బటన్‌ కనిపిస్తుంది. అది క్లిక్‌ చేయగానే మెటా ఏఐ చాట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో యూజర్లు తమకు నచ్చిన సమాచారాన్ని పొందొచ్చు. అయితే ఇదే చాట్‌లో మీ ఊహకు నచ్చినట్లుగా ఒక టెక్ట్స్‌ను ఇచ్చి మెసేజ్‌ చేసినట్లుగానే ఎంటర్‌ చేయాలి. దీంతో వెంటనే క్షణాల్లో వాట్సాప్‌ సదరు ఫొటోను రూపొదించి చాట్ పేజీలో ప్రత్యక్షమవుతుంది. దీంతో ఈ ఫొటోను ఇదరులకు షేర్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక కొండ ప్రాంతంలో వర్షం పడుతుంది అన్నట్లు టెక్ట్స్‌ను ఎంటర్ చేస్తే వెంటనే ఆ ఫొటో వచ్చేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..