Credit Card: ఇలా క్రెడిట్ కార్డు వాడితే మీకు లాభమే లాభం.. చాలామందికి తెలియని చిన్న ట్రిక్
క్రెడిట్ కార్డు ఎలా వాడాలో తెలియక చాలామంది అప్పుల పాలవుతుంటారు. క్రెడిట్ కార్డు ఉంది కదా అని ఎలా పడితే అలా వాడేస్తూ ఉంటారు. కానీ బిల్లు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల క్రెడిట్ కార్డు నుంచి 45 రోజుల పాటు వడ్డీ లేకుండా డబ్బులు వాడుకోవచ్చు.

ఇండియాలో క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఉద్యోగులు, వ్యాపారులతో పాటు సామాన్య వ్యక్తులు కూడా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు. కొంతమంది వీటిని ఎలా వాడాలో తెలియక అప్పుల పాలవుతుంటే.. మరికొంతమంది ఆఫర్లు, డిస్కౌంట్స్ పొందుతూ డబ్బులు ఆదా చేసుకుంటున్నారు. క్రెడిట్ ద్వారా మనం 45 లేదా 50 రోజుల వరకు వడ్డీ లేకుండా డబ్బులు వాడుకోవచ్చు. మీ బిల్లింగ్ సైకిల్‌ను బట్టి మీరు 45 రోజుల పాటు వడ్డీ లేకుండా డబ్బులు వాడుకోవచ్చు. ఈ సదుపాయం ఎలా పొందాలి..? మీ బిల్లింగ్ సైకిల్ ఎలా సెట్ చేసుకోవాలి? అనే విషయాలు తెలుసుకుందాం.
బిల్లింగ్ సైకిల్ సెట్ చేసుకోండి
మీరు కార్డును స్కైప్ చేసిన రోజు నుంచి కాకుండా మీ ట్రాన్సాక్షన్ బిల్లు చేసిన రోజు నుంచి బ్యాంకులు వడ్డీని లెక్కిస్తాయి. ప్రతి నెల బిల్ జనరేషన్‌కు ఒక ఫిక్స్ డ్ డేట్ అనేది ఉంటుంది. ఈ తేదీ తర్వాత మీరు చేసే ట్రాన్సాక్షన్లకు బిల్లింగ్ డేట్ ఎక్కువకాలం ఉంటుంది. దీని వల్ల మీరు వడ్డీ లేకుండా డబ్బులు వాడుకునే కాలం ఎక్కువగా ఉంటుంది. అదే మీ బిల్లు జనరేషన్ అయ్యే టైమ్‌లో చేసే ట్రాన్సాక్షన్లకు టైమ్ తక్కువ ఉంటుంది. ఉదాహరణకు ఒక నెలలో ఐదో నుండి తదుపరి నెలలో నాల్గోవ తేదీ వరకు నడిచే బిల్లింగ్ సైకిల్‌ను తీసుకుందాం. మీరు ఆరవ తేదీ ఏదైనా కొనుగోలు చేస్తే, అది తదుపరి నెల బిల్లులో కనిపిస్తుంది. దీని వల్ల మీకు 45 రోజుల సమయం ఉంటుంది. అదే మూడో తేదీన ట్రాన్సాక్షన్లు చేస్తే కేవలం రెండు వారాలు మాత్రమే టైమ్ ఉంటుంది.
బిల్లు మొత్తం చెల్లించాలి
మీరు క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం చెల్లిస్తేనే లాభం జరుగుతుంది. బిల్లులో కొంత మొత్తాన్ని లేదా మినిమం బ్యాలెన్స్ చెల్లిస్తే నష్టపోతారు. బ్యాంకులు చెల్లించని భాగంపై మాత్రమే కాకుండా మొత్తం బ్యాలెన్స్‌పై వడ్డీని వసూలు చేస్తాయి. ఇలాంటి సమయంలో వడ్డీ లేని వ్యవధి కొనసాగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ పూర్తిగా బిల్లు చెల్లించని సమయంలో ఆ ఆప్షన్ ఉండదు.
వీటిని పాటించండి
మీరు వడ్డీ లేని కాలాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలంటే మీ ఖర్చులను బట్టి బిల్లింగ్ తేదీ ఎంచుకోండి. అలాగే కొత్తగా ఏమైనా కొనుగోలు చేసేటప్పుడు పెండింగ్ బిల్లును చెల్లించండి. మీరు వీటిని పాటిస్తే 45 రోజుల పాటు వడ్డీ లేని డబ్బులు వాడుకోవచ్చు. దీని వల్ల మీరు క్రెడిట్ కార్డు లాభదాయకంగా వాడుకోవచ్చు.




