WhatsApp: మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్.. యూజర్లకు ఇక పండగే..

ముఖ్యమైన వాట్సాప్ లో జరిగే అప్ డేట్ లపై వినియోగదారులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త ఫీచర్ రానుంది. ముఖ్యంగా చాట్, స్టేటస్ అప్‌డేట్‌ల కోసం, వేగవంతమైన పనితీరు కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ ను అభివృద్ధి చేస్తోంది. వాట్సాప్ యూజర్ల కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

WhatsApp: మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్.. యూజర్లకు ఇక పండగే..
Whatsapp
Follow us

|

Updated on: Apr 25, 2024 | 3:54 PM

మన రోజు వారీ పనులలో భాగంగా సమాచారాన్ని వేరొకరికి పంపించడానికి ఎక్కువగా ఉపయోగించే సాధనం వాట్సాప్. ఫొటోలు, డాక్యుమెంట్లు, వీడియోలు ఇలా అన్నీ వాట్సాప్ ద్వారానే పంపిస్తుంటాం. లేకపోతే సమాచారం పంపించడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. ఈ-మెయిల్, ఇతర సాధనాలు ఉన్నప్పటికీ వాట్సాప్‌లోనే ఆ ప్రక్రియ సులభంగా జరుగుతుంది. ఇంత ముఖ్యమైన వాట్సాప్ లో జరిగే అప్ డేట్ లపై వినియోగదారులకు ఎంతో ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త ఫీచర్ రానుంది. ముఖ్యంగా చాట్, స్టేటస్ అప్‌డేట్‌ల కోసం, వేగవంతమైన పనితీరు కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ ను అభివృద్ధి చేస్తోంది. వాట్సాప్ యూజర్ల కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

మెరుగైన సేవలు..

తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి వాట్సాప్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఇందుకోసం క్రమం తప్పకుండా కొత్త ఫీచర్లను యాడ్ చేస్తుంది. తాజా నివేదికల ప్రకారం మీరు మీ కుటుంబం, స్నేహితులతో సులభంగా కనెక్ట్ అయ్యే ఫీచర్లపై పని చేస్తోంది. వాట్సాప్‌కు సంబంధించిన అప్‌డేట్‌లను తెలియజేసే వాబీటా ఇన్ఫో సమాచారం ప్రకారం.. మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ చాట్‌ల కోసం ట్యాబ్‌ను, స్టేటస్ అప్‌డేట్‌లకు వేగవంతమైన ప్రతిస్పందనలను తెలియజేసే ఫీచర్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది.

అనేక ఉపయోగాలు..

కొత్త అప్ డేట్ ద్వారా మీరు ఇంటరాక్ట్ అయ్యే వ్యక్తులను సులభంగా కనుగొనవచ్చు. వాట్సాప్ లో స్టేటస్ అప్‌డేట్‌లకు వేగంగా స్పందించవచ్చు. వాట్సాప్ వినియోగదారులు త్వరలో యాప్ సెట్టింగ్‌లలో నేరుగా తమ స్నేహితులు, సమూహాలను జోడించగలరు, తమకు నచ్చిన క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకోగలరు. లేదా తీసివేయగలరు. ముఖ్యంగా కాల్స్ ట్యాబ్ నుంచి వినియోగదారులు తమకు ఇష్టమైన స్నేహితులు, సమూహాలను సులభంగా యాక్సెస్ చేయడానికి, నిర్వహించడానికి ఈ ఫీచర్ రూపొందిస్తున్నారు.

వేగంగా ప్రతిస్పందన..

స్టేటస్ అప్‌డేట్‌లపై వేగంగా ప్రతిస్పందించడానికి వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తయారు చేస్తోంది. భవిష్యత్తు అప్‌డేట్ కోసం సెట్ చేయబడిన ఈ ఫీచర్, వినియోగదారులు స్టేటస్ అప్‌డేట్‌లకు రియాక్షన్‌లను జోడించడానికి వీలు కల్పిస్తుంది, ఇతర వినియోగదారులు పోస్ట్ చేసిన కంటెంట్‌పై వ్యాఖ్యలను సులభతరం చేస్తుంది. స్టేటస్ అప్‌డేట్‌లకు వినియోగదారులు వేగంగా ప్రతిస్పందించడానికి అనుమతిస్తుంది. ఇతరులు పోస్ట్ చేసిన కంటెంట్ పై వ్యాఖ్యలు చేయవచ్చు. ఇవి నేరుగా స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

అధికారిక సమాచారం లేదు..

వాబీటా సమాచారం నమ్మదగినది అయినప్పటికీ, ఈ అప్‌డేట్‌లకు సంబంధించి వాట్సాప్ అధికారికంగా ప్రకటించలేదు. కాబట్ట అధికారంగా సమాచారం వచ్చేసరికీ వేచి చూడాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..