AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెక్నాలజీతో కొత్త టెన్షన్.. మీ మెదడును కూడా హ్యాక్ చేయొచ్చు!

ఎవరు తోడుకున్న గోతితో వారే పడుతారు అన్నట్టు.. మానవుడు కనిపెట్టిన టెక్నాలజీనే తనకు హానికరంగా మారుతుంది. ఇటీవల కొన్ని రోబోలు మానవులపై దాడి చేయడమే దానికి ఉదహారణ. ఇదే తరహాలో ఇప్పుడు మానవుడు అభివృద్ధి చేసిన టెక్నాలజీతో మనిషి మెదడును కూడా హ్యాక్ చేసే పరిస్థితులు రాబోతున్నాయని, న్యూరోసైన్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (బీసీఐ) అనే ఈ సరికొత్త టెక్నాలజీకి ఇందుకు ఆజ్యం పోస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టెక్నాలజీతో కొత్త టెన్షన్.. మీ మెదడును కూడా హ్యాక్ చేయొచ్చు!
Brain Hack
Anand T
|

Updated on: Jul 06, 2025 | 9:03 PM

Share

మానవ మెదడును హ్యాక్ చేయడం అనేది ఇప్పటివరకు మనం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూశాం. కానీ రావోయే కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో ఇది నిజమయ్యే ప్రమాదం ఉందని న్యూరోసైన్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (బీసీఐ) టెక్నాలజీ వల్ల ఈ ముప్పు వచ్చే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ గ్లోబల్ క్యాంపస్ నివేదిక ప్రకారం.. బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌ టెక్నాలజీ అనేది మనిషి ఆలోచనల ద్వారా కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను నియంత్రించేందుకు ఉపయోగిస్తారు. శరీరంలో అమర్చే ఇంప్లాంట్లు లేదా తలపై ధరించే సెన్సార్ల ద్వారా ఇది పనిచేస్తుంది. అయితే, రాబోయే కాలంలో ఈ టెక్నాలజీనే సాంకేతికతే హ్యాకర్లకు ఆయుధంగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఈ టెక్నాలజీ ద్వారా మెదడు నుంచి కంప్యూటర్‌కు వెళ్లే డేటాను హాకర్లు అడ్డగించి మన ఆలోచనలను చదివే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అదేకాకుండా మెదడుకు పంపే సిగ్నల్స్‌ను తమ ఆదీనంలో పెట్టుకొని వాటిని తారుమారు చేసి మన ప్రవర్తనను కూడా ప్రభావితం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ టెక్నాలజీ కారణంగా ‘న్యూరోప్రైవసీ’ అనే కొత్త సమస్య పుట్టుకొచ్చిందని.. మానవ మెదడులోని డేటా బయటకు తెలిస్తే, వారి అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత ఆలోచనలు ఇతరులకు తెలిసిపోతాయని.. అలాంటి పరిస్థితులు మానసిక స్వేచ్చకు ఉల్లంఘనగా పరిగణించబడతాయని, ప్రతి మానవుడికి తమ ఆలోచనలపై నియంత్రణ, గోప్యత ఉండే హక్కును కల్పించాల్సిన అవసరం ఎంతగానో ఉందని కొన్ని నివేదికలు నొక్కిచెప్పాయి.

అయితే, ప్రస్తుతానికి మానవ మెదడును కంట్రోల్‌ చేసేంత శక్తవంతమైన టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి రాలేదని యునెస్కో కొరియర్ పేర్కొంది. కానీ వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో భవిష్యత్ ఇలాంటి పరిస్థితలును ఎదుర్కొనేందుకు నిపుణులు ‘న్యూరోసెక్యూరిటీ’ అనే కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తుట్టు తెలిపింది. హ్యాకర్ల నుంచి కంప్యూటర్‌ వంటి పరికరాలను కాపాడే సెక్యూరిటీ సిస్టమ్స్‌ మాదిరి ఇది పనిచేస్తోందని తెలిపింది. వైద్య రంగం నుంచి ఈ బీసీఐ టెక్నాలజీ వినియోగదారుల చేతికి వస్తున్న క్రమంలో ప్రభుత్వాలు కఠినమైన భద్రతా నియమావళి, నైతిక మార్గదర్శకాలును తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఇది కొన్ని నివేదికల ఆధారంగా అందుతున్న సమాచారం మాత్రమే

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?