Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ChatGPT: పదేళ్లుగా డాక్టర్లు గుర్తించని వ్యాధిని చాట్‌ జీపీటీ క్షణాల్లోనే గుర్తించింది.. వైరల్‌గా మారిన పోస్ట్‌

ChatGPT: తన ఆరోగ్యానికి సంబంధించిన లక్షణాలను, ల్యాబ్‌ రిపోర్ట్‌ను చాట్‌ జీపీటీలో నమోదు చేసినప్పుడు ఈ మ్యూటేషన్‌ గురించి తెలిసిందని అన్నారు. ఈ సమస్య MTHFR మ్యూటేషన్‌తో సంబంధం ఉందని చెప్పాడు. అయితే నా శరీరంలో B12 లెవెల్స్ సాధారణంగా కనిపించినా..

ChatGPT: పదేళ్లుగా డాక్టర్లు గుర్తించని వ్యాధిని చాట్‌ జీపీటీ క్షణాల్లోనే గుర్తించింది.. వైరల్‌గా మారిన పోస్ట్‌
Subhash Goud
|

Updated on: Jul 07, 2025 | 10:20 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆర్టిఫీషియల ఇంటెలిజెన్స్‌ చరిత్ర సృష్టిస్తోంది. టెక్నాలజీ రంగంలో ఈ కృతిమ మేధస్సు (AI) అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఎలాంటి ప్రశ్నలకైనా క్షణాల్లోనే సులభంగా సమాధానాలను అందిస్తోంది. ఈ ఏఐ టెక్నాలజీ వల్ల రానున్న రోజుల్లో ఎన్నో ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు ఇప్పటికే అంచనా వేస్తున్నారు. పెద్ద పెద్ద సమస్యలను సైతం సునాయాసంగా పరిష్కారాలు చూపిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా స్పందిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఏఐ. తాజాగా అలాంటి ఒక ఘటన గురించి ఒక నెటిజెన్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర పోస్ట్ చేశాడు. ఇప్పుడు పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది.

తనకు 10 సంవత్సరాల నుండి వేధిస్తున్న ఓ ఆరోగ్య సమస్యకు పరిష్కారం లభించలేదని, చాట్‌జీపీటీ ద్వారా సరైన సమాధానం లభించిందని చెప్పాడు. ఈ సమస్య గురించి ఎందరో వైద్యులను సంప్రదించినప్పటికీ వారి నుంచి పరిష్కారం లభించలేదని, ఈ చాట్‌ జీపీటీతో పరిష్కారం లభించిందన్నారు. రెడ్డిట్ లో ‘@Adventurous-Gold6935’ అనే యూజర్.. “చాట్‌జీపీటీ 10+ఏళ్ల సమస్యను నిమిషాల్లోనే పరిష్కరించింది. వైద్యులు దీన్ని కనుగొనలేకపోయారు” అనే శీర్షికతో ఈ పోస్ట్‌ను షేర్ చేశాడు. గత పదేళ్లుగా లభించని పరిష్కారం.. ఈ చాట్‌ పీజీటీ ద్వారా క్షణాల్లోనే లభించిందని అన్నారు. తాను స్పైనల్ MRI, CT స్కాన్, రక్త పరీక్షలు, లైమ్ వ్యాధి కోసం కూడా పరీక్షలు చేయించానని పోస్ట్‌లో తెలిపాడు.

చాలా మంది నెటిజన్లు తమ సొంత సమస్యలను పంచుకోవడం ప్రారంభించడంతో పోస్ట్ త్వరగా వైరల్ అయింది. ChatGPT ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి దీన్ని ఎలా మారుస్తుందో కూడా చాలా మంది వ్యాఖ్యానించారు. దేశంలోని ఎన్నో ముఖ్యమైన ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నాను.. న్యూరాలజిస్ట్‌తో సహా అనేక నిపుణులను సంప్రదించినా, నా సమస్యకు సరైన నిర్ధారణ జరగలేదు. తాను ఫంక్షనల్ హెల్త్ పరీక్ష చేయించాను, అప్పుడు నాకు హోమోజైగస్ A1298C MTHFR మ్యూటేషన్ ఉన్నట్లు తెలిసింది. ఈ సమస్య 7–12 శాతం మందిలో మాత్రమే ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు.

తన ఆరోగ్యానికి సంబంధించిన లక్షణాలను, ల్యాబ్‌ రిపోర్ట్‌ను చాట్‌ జీపీటీలో నమోదు చేసినప్పుడు ఈ మ్యూటేషన్‌ గురించి తెలిసిందని అన్నారు. ఈ సమస్య MTHFR మ్యూటేషన్‌తో సంబంధం ఉందని చెప్పాడు. అయితే నా శరీరంలో B12 లెవెల్స్ సాధారణంగా కనిపించినా, ఈ మ్యూటేషన్ వల్ల శరీరం B12ని సరిగ్గా ఉపయోగించలేకపోతోంది. అందుకే సప్లిమెంట్లు తీసుకోవాలి అని చాట్‌జీపీటీ సూచించినట్లు ఆయన చెప్పాడు. ఇతంత తెలుసుకునే తానే షాక్‌ అయ్యానని అన్నాడు.

Chatgpt Post

ఇది కూడా చదవండి: Best Scheme: ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే రెట్టింపు ఆదాయం.. అద్భుతమైన స్కీమ్‌

ఇది కూడా చదవండి: Personal Finance: నెలాఖరులోగా డబ్బులతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ట్రిక్స్‌ ధనవంతులను చేస్తుంది?

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి