PM Modi: ‘దేశం తలెత్తుకునేలా చేశారు’.. ఆసియా గేమ్స్ విజేతలను ఘనంగా సత్కరించిన ప్రధాని మోడీ.. వీడియో
కెరీర్‌పరంగా ఎన్నో అవకాశాలు ఉన్నా క్రీడలను ఎంచుకొని దేశం తలెత్తుకునేలా చేసిన ఏషియన్ గేమ్స్ విజేతలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ఏషియన్ గేమ్స్‌లో క్రీడాకారులు చూపిన ప్రతిభ భారత విజయానికి ప్రతీకని కొనియాడారు. ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన క్రీడాకారులతో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో క్రీడాకారులు, వారి ట్రెయినర్లు, కోచ్‌లు,

కెరీర్‌పరంగా ఎన్నో అవకాశాలు ఉన్నా క్రీడలను ఎంచుకొని దేశం తలెత్తుకునేలా చేసిన ఏషియన్ గేమ్స్ విజేతలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. ఏషియన్ గేమ్స్‌లో క్రీడాకారులు చూపిన ప్రతిభ భారత విజయానికి ప్రతీకని కొనియాడారు. ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన క్రీడాకారులతో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో క్రీడాకారులు, వారి ట్రెయినర్లు, కోచ్‌లు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు ఏషియన్ గేమ్స్ బృందంలో భాగంగా నిలిచిన ప్రతీ ఒక్కరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతీ ఆటలో సాధించిన మెడల్స్‌ను ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. దశాబ్దాలుగా ఈ విజయాలను చూసేందుకు, వినేందుకు దేశమంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోందని అన్నారు. ఈ విజయాలు యువతరానికి ప్రేరణగా నిలుస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ స్ఫూర్తి ఒలింపిక్స్‌లోనూ కనిపించాలని ఆకాంక్షించారు. ఏషియన్ గేమ్స్‌లో మహిళా క్రీడకారులు చూపిన ప్రతిభను ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇదే నవభారత స్ఫూర్తి అని అభినందనలు తెలిపారు. గతంలోనూ క్రీడాకారులు మంచి ఆటతీరే కనబరిచినా రకరకాల సవాళ్ల కారణంగా మెడల్స్ సాధించడంలో వెనుకబడి పోయామని ప్రధాని అన్నారు. భారత క్రీడారంగానికి కొత్త రూపు తెచ్చేందుకు కాయకల్ప చికిత్స 2014లో మొదలైందని ప్రధాని వెల్లడించారు. తొమ్మిదేళ్ల క్రితంతో పోల్చితే ప్రస్తుతం క్రీడా బడ్జెట్ మూడు రెట్లు పెరిగిన విషయాన్ని క్రీడాకారులకు ప్రధాని తెలిపారు.
ఆసియా క్రీడల్లో సెంచరీ..
కాగా ఆసియా క్రీడల్లో అత్యుత్తమ విజయాలు సాధించిన క్రీడాకారులకు, భవిష్యత్ పోటీలకు వారిని ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి వారికి ప్రత్యేక ఆతిథ్యాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. క్రీడాకారులు అత్యుత్తమంగా ఉండేలా ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. 1951లో తొలి ఏషియన్ గేమ్స్ ఈ స్టేడియంలోని జరిగిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత్ 107 మెడల్స్ సాధించింది. కాగా ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ వందకు పైగా పతకాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడల్లో సాధించిన పతకాల పరంగా భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. దీంతో పతక విజేతలను ప్రధాని మోదీ ప్రత్యేక ఆతిథ్యంతో సత్కరించారు.
క్రీడా బడ్జెట్ పెంచుతున్నాం..
Interacting with our incredible athletes who represented India at the Asian Games. Their outstanding performances exemplify true spirit of sportsmanship. https://t.co/SAcnyJDTlc
— Narendra Modi (@narendramodi) October 10, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




