Neeraj Chopra: చరిత్ర సృష్టించిన ‘గోల్డెన్ బాయ్’.. రికార్డ్ త్రోతో డైమండ్ లీగ్ టైటిల్ పట్టేసిన నీరజ్ చోప్రా..
Lausanne Diamond League: 'గోల్డెన్ బాయ్' నీరజ్‌కి ఈ ఏడాదిలో ఇది రెండో బంగారు పతకం. అంతకుముందు మేలో దోహాలో జరిగిన డైమండ్ లీగ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.
‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా మరో రికార్డు సృష్టించాడు. 87.66 మీటర్ల త్రోతో డైమండ్ లీగ్ టైటిల్ గెలుచుకున్నాడు. నీరజ్‌కి ఈ ఏడాదిలో ఇది రెండో బంగారు పతకం కావడం గమనార్హం. అంతకుముందు మేలో దోహాలో జరిగిన డైమండ్ లీగ్‌లో టైటిల్‌ను గెలుచుకున్నాడు.
గాయం తర్వాత నీరజ్ చోప్రా బలమైన పునరాగమనం చేశాడు. సుమారు నెల రోజుల గాయం విరామం తర్వాత, అతను ఈటెతో మైదానంలోకి వచ్చాడు. ఐదో రౌండ్‌లో 87.66 మీటర్లు విసిరి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. నీరజ్‌కి ఇది ఎనిమిదో అంతర్జాతీయ బంగారు పతకం. అంతకుముందు ఆసియా క్రీడలు, దక్షిణాసియా క్రీడలు, ఒలింపిక్ క్రీడలు, డైమండ్ లీగ్ వంటి టోర్నీల్లో బంగారు పతకాలు సాధించాడు.
ఫౌల్‌తో ప్రారంభించి..
నీరజ్ చోప్రా తన రౌండ్‌ను ఫౌల్‌తో ప్రారంభించాడు. రెండో రౌండ్‌లో నీరజ్ 83.52 మీటర్లు విసిరాడు. మూడో రౌండ్‌లో నీరజ్ 85.02 మీటర్లు సాధించాడు. అదే సమయంలో, నాల్గవ రౌండ్‌లో మళ్లీ ఫౌల్ చేయగా, ఐదో రౌండ్‌లో నీరజ్ జావెలిన్‌ను 87.66 మీటర్ల దూరంలో విసిరాడు. ఈ త్రోతో అతను మొదటి స్థానానికి వచ్చాడు. ఆరో చివరి రౌండ్‌లో నీరజ్ 84.15 మీటర్లు విసిరాడు.
India’s javelin ace Neeraj Chopra wins men’s javelin throw title at Lausanne leg of prestigious Diamond League series; throws 87.66 metres to win the spot.
(File Pic) pic.twitter.com/TXVYk27bg9
— ANI (@ANI) June 30, 2023
జర్మనీకి చెందిన జూలియన్ రెండో స్థానంలో..
ఈ ఈవెంట్‌లో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ రెండో స్థానంలో నిలిచాడు. 87.03 మీటర్లు విసిరి రజత పతకం సాధించాడు. అదే సమయంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వడ్లెజ్చే మూడో స్థానంలో నిలిచాడు. అతను 86.13 మీటర్లు విసిరాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..