లాస్ ఏంజెల్స్‌లో సత్తా చాటిన యువ అథ్లెట్.. జాతీయ రికార్డ్‌ బ్రేక్ చేసిన భారత మహిళ ఎవరంటే?

లాస్ ఏంజెల్స్‌లో జరిగిన స్టీపుల్‌చేజ్‌లో మీరట్ అథ్లెట్ పరుల్ చౌదరి జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. ఈ యువ అథ్లెట్ కేవలం 8 నిమిషాల 57.19 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది.

లాస్ ఏంజెల్స్‌లో సత్తా చాటిన యువ అథ్లెట్.. జాతీయ రికార్డ్‌ బ్రేక్ చేసిన భారత మహిళ ఎవరంటే?
Parul Chaudhary
Follow us

|

Updated on: Jul 04, 2022 | 4:56 PM

లాస్ ఏంజెల్స్‌లో జరిగిన స్టీపుల్ ఛేజ్‌లో భారత అథ్లెట్ పరుల్ చౌదరి చరిత్ర సృష్టించింది. పారుల్ చౌదరి కేవలం 8 నిమిషాల 57.19 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. పరుల్ మూడో స్థానం నిలిచింది. అయితే, భారత చరిత్రలో ఏ మహిళా అథ్లెట్‌ తరపున చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం. ఈ విజయం తర్వాత పరుల్ పేరు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ భారత అథ్లెట్‌కు అందరూ సెల్యూట్ చేస్తున్నారు. అయితే ఈ ఫేమ్ వచ్చేందుకు పరుల్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ కఠోర శ్రమ క్రీడలలోనే కాదు.. నిజ జీవితంలోనూ పడాల్సి వచ్చింది.

పరుల్ ఒక పేద రైతు కూతురు..

పరుల్ చౌదరి మీరట్‌ నివాసి. పరుల్ చౌదరి తండ్రి రైతు. ఆమె 2011 వరకు పొలం పనులు చేస్తూ ఉండేది. 2011లో ఆమె కోచ్ అమ్రిష్ అథ్లెటిక్స్‌పై దృష్టి పెట్టాలని కోరడంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. పరుల్ ఐదు, 10 వేల మీటర్ల రేసులో పాల్గొంది. కానీ, 2016-17 సంవత్సరంలో 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో పాల్గొనడం ప్రారంభించింది. ఆమె నిర్ణయం ఫలించడం ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె లాస్ ఏంజిల్స్‌లో చరిత్ర సృష్టించింది.

ఇవి కూడా చదవండి

స్టీపుల్‌చేజ్‌లో సూర్య లోగనాథన్ రికార్డును పరుల్ చౌదరి బద్దలు కొట్టింది. ఈ అథ్లెట్ 6 సంవత్సరాల క్రితం మూడు వేల మీటర్ల రేసును 9 నిమిషాల 04.5 సెకన్లలో పూర్తి చేసింది. అయితే ఇప్పుడు ఈ రికార్డును పరుల్ చౌదరి తన పేరిట లిఖించుకుంది.

జాతీయ రికార్డు బద్దలు..

లాస్ ఏంజిల్స్‌లో స్టీపుల్ ఛేజ్ సమయంలో పరుల్ ప్రారంభ దశలో చాలా కష్టపడింది. ఆమె ఐదవ స్థానంలో ఉన్న సమయంలో.. అద్భుతమైన పునరాగమనం చేసి ఇద్దరు ప్రత్యర్థులను అధిగమించింది. మొత్తంగా మూడో స్థానంలో నిలిచింది.