RCB: టోర్నీ ప్రారంభానికి ముందే ఆర్సీబీకి భారీ షాక్.. ధనాధన్ లీగ్ నుంచి తప్పుకున్న స్టార్ ప్లేయర్
హిళల ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ వచ్చే నెల ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమవుతుంది. ఇందుకోసం అన్ని టీమ్‌లు తమ సన్నాహాలను కూడా ప్రారంభించాయి. అయితే ఈ ధనాధన్ లీగ్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ షాక్ తగిలింది. టోర్నీ ప్రారంభానికి మరికొన్ని రోజులు మిగిలి ఉండగానే ఆ జట్టు స్టార్ బ్యాటర్

మహిళల ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ వచ్చే నెల ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమవుతుంది. ఇందుకోసం అన్ని టీమ్‌లు తమ సన్నాహాలను కూడా ప్రారంభించాయి. అయితే ఈ ధనాధన్ లీగ్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ షాక్ తగిలింది. టోర్నీ ప్రారంభానికి మరికొన్ని రోజులు మిగిలి ఉండగానే ఆ జట్టు స్టార్ బ్యాటర్ గా నిలిచిన ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్ హీథర్ నైట్ లీగ్ నుంచి వైదొలిగింది.ఆమె తదుపరి ఎడిషన్‌లో ఆడడం లేదని సమాచారం. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నుండి హీథర్ నైట్ తన పేరును ఎందుకు ఉపసంహరించుకుందనే దానిపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరైన కారణాన్ని వెల్లడించలేదు. అయితే హీథర్ నైట్ మాదిరిగానే, ఇంగ్లండ్ జట్టులోని ఇతర మహిళా క్రీడాకారులు కూడా మహిళల ప్రీమియర్ లీగ్ నుండి వైదొలగుతున్నారని ప్రచారం సాగుతోంది.
దీనికి సరైన కారణం తెలియనప్పటికీ, మహిళల ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ మహిళల జట్టు న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్, మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌ను ఆడవలసి ఉంది. ఈ సిరీస్ పై మరింత దృష్టి సారించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు మహిళా ప్లేయర్లు మహిళల ప్రీమియర్ లీగ్ నుంచి వైదొలుగుతున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 23న ప్రారంభమయ్యే మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మార్చి 17న జరగనుంది. అయితే ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ మార్చి 19న డునెడిన్‌లో జరగనుంది. కాబట్టి ద్వైపాక్షిక సిరీస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో హీథర్ నైట్ మహిళల ప్రీమియర్ లీగ్ నుంచి వైదొలిగే అవకాశం ఉంది. RCB ఇప్పుడు హీథర్ నైట్ స్థానంలో దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ నాడిన్ డి క్లెర్క్‌ను ఎంపిక చేసింది.
Sad to announce I’m withdrawing from the @wplt20 this year, but it’s the right thing for me to be available for the whole England tour of NZ. All the best @RCBTweets and @mandhana_smriti for the coming season 👊🏼 pic.twitter.com/5wW7GEhydp
— Heather Knight (@Heatherknight55) January 27, 2024
రీప్లేస్ మెంట్ ఎవరంటే?
మీడియం పేస్ బౌలర్. రైట్ ఆర్మ్ బ్యాట్స్‌మెన్, డి క్లెర్క్ దక్షిణాఫ్రికా తరపున 30 ODIలు, 46 T20Iలు ఆడింది. నివేదికల ప్రకారం WPLలో పాల్గొన్నప్లేయర్లు T20 లీగ్ ముగిసే వరకు భారత్‌లో ఉంటే న్యూజిలాండ్‌లో జరిగే మొదటి మూడు T20 మ్యాచ్‌లకు పరిగణనలోకి తీసుకోమని ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) తెలిపినట్లు సమాచారం.అందుకే ఆటగాళ్లు ఒక్కొక్కరుగా లీగ్ నుంచి వైదొలగుతున్నారు. హీథర్ నైట్‌తో పాటు, యుపి వారియర్స్ తరపున ఆడాల్సిన లారెన్ బెల్ న్యూజిలాండ్ టూర్‌కు సన్నద్ధం కావడమే తన ప్రాధాన్యత అని పేర్కొంటూ శుక్రవారం డబ్ల్యుపిఎల్ నుండి తన పేరును ఉపసంహరించుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..