AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kotambi Stadium : ఇది స్టేడియం కాదు ఒక విలాసవంతమైన ప్యాలెస్..రూ.215 కోట్లతో వడోదరలో క్రికెట్ మ్యాజిక్!

Kotambi Stadium : టీమిండియా 2026 కొత్త ఏడాదిని అదిరిపోయే క్రికెట్ వేటతో ప్రారంభించబోతోంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్‌లో హైలైట్ ఏంటంటే.. తొలి మ్యాచ్ వడోదరలో కొత్తగా నిర్మించిన కోటాంబి స్టేడియంలో జరగబోతోంది.

Kotambi Stadium : ఇది స్టేడియం కాదు ఒక విలాసవంతమైన ప్యాలెస్..రూ.215 కోట్లతో వడోదరలో క్రికెట్ మ్యాజిక్!
Kotambi Stadium
Rakesh
|

Updated on: Jan 09, 2026 | 9:26 PM

Share

Kotambi Stadium : టీమిండియా 2026 కొత్త ఏడాదిని అదిరిపోయే క్రికెట్ వేటతో ప్రారంభించబోతోంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్‌లో హైలైట్ ఏంటంటే.. తొలి మ్యాచ్ వడోదరలో కొత్తగా నిర్మించిన కోటాంబి స్టేడియంలో జరగబోతోంది. ఇది పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌కు వేదిక కావడం ఇదే మొదటిసారి. బరోడా క్రికెట్ అసోసియేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ స్టేడియం విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వడోదర నగరం వెలుపల హరోద్-హలోల్ హైవే సమీపంలో నిర్మించిన కోటాంబి స్టేడియం భారత క్రికెట్ మ్యాప్‌లో సరికొత్త సెంటర్‌గా అవతరించింది. 2024 డిసెంబర్‌లో భారత్-వెస్టిండీస్ మహిళల మ్యాచ్‌తో ఈ స్టేడియం తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి హేమాహేమీలు ఈ గ్రౌండ్‌లో మొదటిసారి బరిలోకి దిగబోతున్నారు. సుమారు 29 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ స్టేడియం బయటి నుంచి చూడటానికి కలప మాదిరిగా ఎంతో అందంగా కనిపిస్తుంది.

ఈ స్టేడియం కేవలం ఆట కోసమే కాదు, ఆటగాళ్ల ఫిట్‌నెస్, రికవరీ కోసం కూడా అధునాతన సౌకర్యాలను కలిగి ఉంది. ఇందులో ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్, జకుజీ, ఐస్ బాత్, ఫిజియో రూమ్స్ ఉన్నాయి. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయడానికి ఇండోర్ నెట్స్, టర్ఫ్, సిమెంట్, ఆస్ట్రోటర్ఫ్ వికెట్లు అందుబాటులో ఉన్నాయి. మీడియా కోసం ప్రత్యేకంగా ఒక టవర్, భారీ బ్రాడ్‌కాస్ట్ కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.

వర్షం పడితే మ్యాచ్ ఆగిపోతుందనే భయం ఇక్కడ లేదు. ఎందుకంటే గ్రౌండ్ అవుట్‌ఫీల్డ్‌ను ఇసుక ఆధారితంగా రూపొందించారు, ఇది నీటిని త్వరగా పీల్చేసుకుంటుంది. పిచ్‌లను కూడా నల్ల మట్టి, ఎర్ర మట్టితో విభిన్నంగా తయారు చేశారు. ఇది బౌలర్లకు, బ్యాటర్లకు సమానంగా సహకరిస్తుంది. ఇక ప్రేక్షకులకు వినోదం పంచడానికి 30,000 సీటింగ్ సామర్థ్యంతో పాటు, కార్పొరేట్ దిగ్గజాల కోసం 35 విలాసవంతమైన బాక్సులను సిద్ధం చేశారు.

మీడియా నివేదికల ప్రకారం, ఈ భారీ స్టేడియం నిర్మాణానికి దాదాపు రూ.200 నుంచి రూ.215 కోట్లు ఖర్చయ్యాయి. 2015లో కేవలం రూ.200 కోట్లతో మొదలైన ఈ ప్రాజెక్ట్, అప్రోచ్ రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం అదనంగా మరో రూ.15 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. బరోడాలో ఉన్న పాత మోతీబాగ్ గ్రౌండ్ స్థానంలో ఇప్పుడు కోటాంబి స్టేడియం క్రికెట్ అభిమానులకు సరికొత్త చిరునామాగా మారింది. రాబోయే డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ కూడా ఇక్కడే జరగనుండటం విశేషం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి. 

7 కోట్లతో తీస్తే 90 కోట్లు.. ఆస్కార్ రేసులో బ్లాక్ బస్టర్ మూవీ
7 కోట్లతో తీస్తే 90 కోట్లు.. ఆస్కార్ రేసులో బ్లాక్ బస్టర్ మూవీ
పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు
ఉదయం 8గంటలకే టిఫిన్ తింటే ఆయుష్షు పెరగుతుందా.. అసలు వాస్తవాలు..
ఉదయం 8గంటలకే టిఫిన్ తింటే ఆయుష్షు పెరగుతుందా.. అసలు వాస్తవాలు..
మీకు శని దోషం ఉందా?: శనివారం ఇలా చేస్తే లైఫ్ అంతా ఫుల్ హ్యాపీస్
మీకు శని దోషం ఉందా?: శనివారం ఇలా చేస్తే లైఫ్ అంతా ఫుల్ హ్యాపీస్
చలికాలంలో మార్నింగ్‌ వాకింగ్‌.. ప్రమాదంలో మీ గుండె ఆరోగ్యం!
చలికాలంలో మార్నింగ్‌ వాకింగ్‌.. ప్రమాదంలో మీ గుండె ఆరోగ్యం!
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు..
నరాలు తెగే ఉత్కంఠ.. ఆర్సీబీ ఆశలపై నీళ్లు చల్లిన ముంబై బౌలర్లు!
నరాలు తెగే ఉత్కంఠ.. ఆర్సీబీ ఆశలపై నీళ్లు చల్లిన ముంబై బౌలర్లు!
'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో ఓ సర్‌ప్రైజ్ ఉంది: ఆషిక, డింపుల్
'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో ఓ సర్‌ప్రైజ్ ఉంది: ఆషిక, డింపుల్
పాండ్యా విశ్వరూపం స్డేడియంలో సిక్సర్ల వర్షం
పాండ్యా విశ్వరూపం స్డేడియంలో సిక్సర్ల వర్షం
భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ బాంబ్.. మరో బాదుడుకు రంగం సిద్ధం
భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ బాంబ్.. మరో బాదుడుకు రంగం సిద్ధం