AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మితిమీరిన ఉత్సాహం.. జైలుకు పంపింది

ఉప్పల్‌ వేదికగా భారత్ - ఇంగ్లాండ్‌  మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆట ముగిసింది.  ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ (148*) అద్భుత సెంచరీతో ఆ జట్టును ఆదుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన ఇండియా.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను త్వరగానే చుట్టేస్తుందని అనుకున్నారు. కానీ, ఓలీ పోప్‌ మాత్రం క్రీజ్‌లో పాతుకుపోయాడు.

Hyderabad: మితిమీరిన ఉత్సాహం.. జైలుకు పంపింది
A spectator intruded on to the field and touched Indian captain Rohit Sharma’s feet
Ranjith Muppidi
| Edited By: Ram Naramaneni|

Updated on: Jan 27, 2024 | 6:23 PM

Share

హైదరాబాద్‌ వేదికగా ఫస్ట్ టెస్టులో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ తొలి రోజు ఆట సందర్భంగా ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ ఫ్యాన్ సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి గ్రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాళ్ళు మొక్కాడు. హిట్‌ మ్యాన్‌ వద్దు అని వారిస్తున్నప్పటికీ అతడు మాత్రం వినిపించుకోలేదు. వెంటనే అప్రమత్తమైన.. గ్రౌండ్ సెక్యూరిటీ సిబ్బంది అతడిని బయటకు తీసుకు వెళ్లారు. ఈ ఘటనను రాచకొండ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. గ్రౌండ్‌లోని దూసుకెళ్లిన యువకుడ్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రాంచంద్రాపురం గ్రామానికి చెందిన హర్షిత్ రెడ్డిగా గుర్తించారు. హర్షిత్ రెడ్డిపై కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు.. న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో.. జైలుకు తరలించారు.

క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ వీక్షించే ప్రేక్షకులు.. వారికి కేటాయించిన సీట్లలో మాత్రమే కూర్చోవాలని.. అతిగా ప్రవర్తించి మైదానంలోకి వెళ్తే.. కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన అనంతరం క్రికెటర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని స్టేడియంలో భద్రతను పెంచారు.

ముగిసిన మూడో రోజు ఆట

ఉప్పల్‌ వేదికగా భారత్ – ఇంగ్లాండ్‌  మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మూడో రోజు ఆట ముగిసింది.  ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ (148*) అద్భుత సెంచరీతో ఆ జట్టును ఆదుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన ఇండియా.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను త్వరగానే చుట్టేస్తుందని అనుకున్నారు. కానీ, ఓలీ పోప్‌ మాత్రం క్రీజ్‌లో పాతుకుపోయాడు. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది.  క్రీజ్‌లో పోప్‌తో పాటు రెహాన్ (16*) ఉన్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 190 పరుగులు వెనకబడిన ఇంగ్లాండ్‌ చివరికి 126 పరుగుల లీడ్ సాధించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…