Rohan Bopanna: చరిత్ర సృష్టించిన రోహన్ బోపన్న.. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఘన విజయం.. ఖాతాలో తొలి గ్రాండ్ స్లామ్
Australian Open Final: 43 ఏళ్ల రోహన్ బోపన్న తన వయస్సును ఈ టోర్నమెంట్‌పై ప్రభావితం చేయనివ్వలేదు. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో కూడా, అతను తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి థామస్ మచక్, జాంగ్ జిన్‌జెన్‌ల జోడీని ఓడించారు. గురువారం జరిగిన ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ దాదాపు 2 గంటల పాటు సాగింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బోపన్న-మాథ్యూ జోడీ 6-3, 3-6, 7-6 (10-7)తో విజయం సాధించారు.

Australian Open Final: టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన విజయాల పరంపరను కొనసాగించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా జట్టుగా తమ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను కూడా గెలుచుకున్నారు. చారిత్రాత్మక మ్యాచ్‌లో, పురుషుల డబుల్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జంట ఇటలీకి చెందిన సిమోన్ బోలెల్లి, ఆండ్రియా వవసోరిని ఓడించారు.
రెండు జోడీల మధ్య గట్టి పోటీ నెలకొంది. తొలి సెట్‌లో బోపన్న-ఎబ్డెన్ జోడీ 7-6తో సిమోన్ బొలెల్లి-ఆండ్రియా వవసోరిపై విజయం సాధించారు. ఆ తర్వాత రెండో సెట్‌లోనూ బోపన్న ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించారు. రెండో సెట్‌లో ఇటలీ ఆటగాళ్లు 7-5తో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఎబ్డెన్, బోపన్న జంటకు ఇది చారిత్రాత్మక క్షణం. ఎందుకంటే ఇది జట్టుగా వారి మొదటి టైటిల్. అదే సమయంలో, బోపన్న కూడా ఈ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకున్న అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు.
2 గంటల పాటు సాగిన సెమీ ఫైనల్..
43 ఏళ్ల రోహన్ బోపన్న తన వయస్సును ఈ టోర్నమెంట్‌పై ప్రభావితం చేయనివ్వలేదు. సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో కూడా, అతను తన భాగస్వామి మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి థామస్ మచక్, జాంగ్ జిన్‌జెన్‌ల జోడీని ఓడించారు. గురువారం జరిగిన ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ దాదాపు 2 గంటల పాటు సాగింది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో బోపన్న-మాథ్యూ జోడీ 6-3, 3-6, 7-6 (10-7)తో విజయం సాధించారు. సూపర్ టై బ్రేకర్స్‌లో బోపన్న తన అనుభవాన్ని ఉపయోగించుకుని అద్భుతమైన రీతిలో ఫైనల్‌కు టిక్కెట్‌ను పొందారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




