WPL Points Table: పాయింట్ల పట్టికలో భారీ మార్పులు.. ‘టాప్’లో ఢిల్లీ… ఆర్సీబీ ప్లేస్ ఎక్కడంటే?
మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నీ రెండో ఎడిషన్ ఉత్కంఠగా జరుగుతోంది. ఫిబ్రవరి 23న ప్రారంభమైన ఈ మెగా క్రికెట్ టోర్నీలో ఇప్పటికే 15 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మార్చి 8 ( శుక్రవారం) ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై యూపీ వారియర్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో WPL 2024 పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
మహిళల ప్రీమియర్ లీగ్ టోర్నీ రెండో ఎడిషన్ ఉత్కంఠగా జరుగుతోంది. ఫిబ్రవరి 23న ప్రారంభమైన ఈ మెగా క్రికెట్ టోర్నీలో ఇప్పటికే 15 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. మార్చి 8 ( శుక్రవారం) ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై యూపీ వారియర్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో WPL 2024 పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు అగ్రస్థానంలో ఉంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి రెండింట్లో ఓడి మొత్తం ఎనిమిది పాయింట్లు సాధించింది. ఢిల్లీ రన్ రేట్ +1.059. ఇక హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ మహిళల జట్టు రెండో స్థానంలో ఉంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచి రెండు మ్యాచ్‌లు ఓడి 8 పాయింట్లు సాధించింది. ముంబై రన్ రేట్ +0.375. స్మృతి మంధాన సారథ్యం వహిస్తోన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో మూడు గెలిచి, మూడింటిలో ఓడిన ఆర్‌సీబీ మొత్తం 6 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. బెంగళూరు రన్ రేట్ +0.038.
ఇక యూపీ వారియర్స్ ఆర్సీబీ చేతిలో ఓడి నాలుగో స్థానానికి పడిపోయింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 4 గెలిచి 3 ఓడిపోయి 6 పాయింట్లు సాధించింది. UP రన్ రేట్ -0.365 మాత్రమే. ఇక మహిళల ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌లో గుజరాత్ జెయింట్స్ జట్టు పరిస్థితి బాగా లేదు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో గెలిచి 2 పాయింట్లు సాధించింది. రన్ రేట్ కూడా -1.278 మాత్రమే.
లేటెస్ట్ WPL పాయింట్ల పట్టిక..
WPL POINTS TABLE ✨ pic.twitter.com/D7wtiFBdta
— CricketGully (@thecricketgully) March 8, 2024
వుమెన్స్ డె స్పెషల్..
𝗦𝗽𝗲𝗰𝗶𝗮𝗹 𝗙𝗲𝗮𝘁𝘂𝗿𝗲 🎥
On International Women’s Day,
We bring you inspiring stories of 5 indomitable Air Force officers who are now deputed as Security Liaison Officers in #TATAWPL 👌👌 – By @RajalArora
WATCH 🔽
— Women’s Premier League (WPL) (@wplt20) March 8, 2024
ఆసక్తికరంగా డబ్ల్యూపీఎల్ మ్యాచ్ లు..
The Punch.ev Electric Striker of the Match between @DelhiCapitals & @UPWarriorz goes to Meg Lanning.#TATAWPL | @tataev | #PunchevElectricStriker | #BeyondEveryday | #DCvUPW pic.twitter.com/OlyyYNnFRJ
— Women’s Premier League (WPL) (@wplt20) March 8, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..