AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: 5 ఇన్నింగ్సుల్లో 3 హాఫ్ సెంచరీలు.. ధర్మశాలలోనూ సర్ఫరాజ్ దూకుడు.. ఆ ముగ్గురి కెరీర్ ఖేల్ ఖతం

భారత జట్టు యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మంచి దూకుడు మీద ఉన్నాడు. తాజాగా ధర్మశాల వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులోనూ అర్ధ సెంచరీ కొట్టాడు. తద్వారా తన టెస్ట్ కెరీర్‌లో మూడో అర్ధ సెంచరీని నమోదు చేశాడు . రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తాను ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించాడు.

IND vs ENG: 5 ఇన్నింగ్సుల్లో 3 హాఫ్ సెంచరీలు.. ధర్మశాలలోనూ సర్ఫరాజ్ దూకుడు.. ఆ ముగ్గురి కెరీర్ ఖేల్ ఖతం
Sarfaraz Khan
Basha Shek
|

Updated on: Mar 09, 2024 | 7:57 AM

Share

భారత జట్టు యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మంచి దూకుడు మీద ఉన్నాడు. తాజాగా ధర్మశాల వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులోనూ అర్ధ సెంచరీ కొట్టాడు. తద్వారా తన టెస్ట్ కెరీర్‌లో మూడో అర్ధ సెంచరీని నమోదు చేశాడు . రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తాను ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు ధర్మశాల టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మరోసారి హాఫ్ సెంచరీ సాధించాడు. సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీతో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు భారత ఆటగాళ్ల కెరీర్‌కు తెరపడిందంటున్నారు క్రికెట్ నిపుణులు. వారు ఎవరనే వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మశాల టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీతో భారత వెటరన్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా పునరాగమనానికి బ్రేక్ పడింది. 36 ఏళ్ల పుజారా ఈ ఏడాది రంజీ ట్రోఫీలో చాలా పరుగులు చేశాడు. అయితే అతనికి భారత జట్టులో చోటు దక్కలేదు. బదులుగా, వారి స్థానంలో యువ ఆటగాళ్లను అనుమతించడం ద్వారా యువ జట్టును నిర్మించే పనిలో BCCI ఉంది.

పూజారా..

విరాట్ కోహ్లీ సిరీస్ నుంచి నిష్క్రమించిన తర్వాత పుజారా తిరిగి జట్టులోకి వస్తాడనే ఆశలు చిగురించాయి. కానీ అతని స్థానంలో రజత్ పాటిదార్‌కు స్థానం కల్పించారు. విశాఖపట్నం టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం కావడంతో సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. అయితే రాహుల్ మొత్తం సిరీస్ నుంచి నిష్క్రమించడంతో మళ్లీ పుజారా పేరు తెరపైకి వచ్చింది. అయితే సెలక్టర్లు మాత్రం సర్ఫరాజ్ ఖాన్ పైనే నమ్మకముంచారు.

ఇవి కూడా చదవండి

భారత జట్టు యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మంచి దూకుడు మీద ఉన్నాడు. తాజాగా ధర్మశాల వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులోనూ అర్ధ సెంచరీ కొట్టాడు. తద్వారా తన టెస్ట్ కెరీర్‌లో మూడో అర్ధ సెంచరీని నమోదు చేశాడు . రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తాను ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించాడు.

రహానే కూడా..

ఛెతేశ్వర్ పుజారా తర్వాత అజింక్యా రహానేకు కూడా టీమ్ ఇండియా తలుపులు మూసేసినట్లే. 2024 రంజీ ట్రోఫీలో ముంబయికి కెప్టెన్‌గా వ్యవహరించనున్న అజింక్య రహానే ఇప్పటివరకు బ్యాట్‌తో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. దీంతో భారత జట్టు తరపున 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలనే అజింక్యా రహానే కల నెరవేరేలా కనిపించడం లేదు.

తెలుగబ్బాయికి కూడా కష్టమే..

సర్ఫరాజ్‌ఖాన్‌ ఫామ్‌తో హనుమ విహారి టీమ్‌ ఇండియా అవకాశలు మూసుకుపోయినట్లే. విహారి భారత్ తరఫున 16 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు, కానీ టెస్టుల్లో మాత్రం తన సత్తా చాటలేకపోయాడు. 2022లో భారత్ తరఫున చివరి టెస్టు మ్యాచ్ ఆడిన విహారి.. ఆ తర్వాత టీమ్ ఇండియాకు తిరిగి రాలేకపోయాడు. ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ ఆట తీరుతో విహారి పునరాగమనం ఇక కష్టమే.

మరిన్ని క్రీడా వార్తలు, కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం..
ఘనంగా మొదలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం..
మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
మటన్ వేపుడు ఇలా చేస్తే దుమ్ముదుమారమే...
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలంటే పొద్దున్నే టీ బదులు ఇది తాగితే చాలు
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన