AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ధర్మశాలలో హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురికి రిటైర్మెంట్ సిగ్నలిచ్చిన సర్ఫరాజ్.. ఎవరంటే?

Sarfaraz Khan Half Century: రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తాను ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు ధర్మశాల టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మరోసారి హాఫ్ సెంచరీ సాధించాడు. సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీతో ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు భారత ఆటగాళ్ల కెరీర్ ముగించాడు. వారు ఎవరనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

IND vs ENG: ధర్మశాలలో హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే.. ఆ ముగ్గురికి రిటైర్మెంట్ సిగ్నలిచ్చిన సర్ఫరాజ్.. ఎవరంటే?
Sarfaraz Khan Ipl 2024 Kkr
Venkata Chari
|

Updated on: Mar 09, 2024 | 9:15 AM

Share

Sarfaraz Khan Half Century: భారత జట్టు యువ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) ఇంగ్లండ్ (India vs England)పై తన టెస్ట్ కెరీర్‌లో మూడో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా తరపున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తాను ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు ధర్మశాల టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మరోసారి హాఫ్ సెంచరీ సాధించాడు. సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీతో ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు భారత ఆటగాళ్ల కెరీర్ ముగించాడు. వారు ఎవరనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

పుజారా పునరాగమనం కష్టం..

ధర్మశాల టెస్టులో సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీతో భారత వెటరన్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారా పునరాగమనానికి బ్రేక్ పడింది. 36 ఏళ్ల పుజారా ఈ ఏడాది రంజీ ట్రోఫీలో చాలా పరుగులు చేశాడు. అయితే, అతనికి భారత జట్టులో చోటు దక్కలేదు. బదులుగా, ఆయన స్థానంలో యువ ఆటగాళ్లను అనుమతించడం ద్వారా యువ జట్టును నిర్మించే పనిలో BCCI ఉంది.

విరాట్ కోహ్లీ సిరీస్ నుంచి నిష్క్రమించిన తర్వాత, పుజారా తిరిగి జట్టులోకి వస్తాడని ఆశలు ఉన్నాయి. కానీ, అతని స్థానంలో రజత్ పాటిదార్‌ను అనుమతించారు. విశాఖపట్నం టెస్టులో కేఎల్ రాహుల్ ఔట్ కావడంతో సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. మొత్తం సిరీస్ నుంచి రాహుల్ నిష్క్రమించిన తర్వాత మళ్లీ పుజారా పేరు తెరపైకి వచ్చింది. కానీ, సెలక్టర్లు సర్ఫరాజ్ ఖాన్ కోసం బ్యాటింగ్ చేశారు.

ఇవి కూడా చదవండి

అజింక్యా రహానె రీఎంట్రీ ఇక కష్టమే?

ఛెతేశ్వర్ పుజారా తర్వాత అజింక్యా రహానేకు కూడా టీమ్ ఇండియా తలుపులు మూసేసినట్లే. 2024 రంజీ ట్రోఫీలో ముంబయికి కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న అజింక్య రహానే ఇప్పటివరకు బ్యాట్‌తో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. సర్ఫరాజ్ ఖాన్ భారత జట్టుకు పరుగుల శిఖరాన్ని నిర్మిస్తున్నాడు. భారత జట్టు తరపున 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలనే అజింక్యా రహానే కల నెరవేరలేదు.

విహారి కెరీర్ కూడా..

సర్ఫరాజ్‌ఖాన్‌ ఫామ్‌తో హనుమ విహారి టీమ్‌ ఇండియా తరపున ఆడే అవకాశాలకు తెరపడింది. హనుమ విహారి భారత్ తరపున 16 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. కానీ, టెస్టుల్లో మాత్రం తన సత్తా చాటలేకపోయాడు. 2022లో భారత్ తరపున చివరి టెస్టు మ్యాచ్ ఆడిన విహారి.. ఆ తర్వాత టీమ్ ఇండియాకు తిరిగి రాలేకపోయాడు. ఇదిలా ఉంటే, సర్ఫరాజ్ ఖాన్ ఆట విహారి పునరాగమనాన్ని చాలా కష్టతరం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..